తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్‌ అర్బన్ డెవలప్‌మెంట్‌ శాఖలో ఉద్యోగాల భర్తీకి ఆగస్టు 8న నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ప్రాథమిక ఆన్సర్ 'కీ'ని టీఎస్‌పీఎస్సీ ఆగస్టు 8న విడుదల చేసింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో మాస్టర్ క్వశ్చన్ పేపర్‌ను అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా అందుబాటులో ఉంచింది. ప్రిలిమినరీ కీపై ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 23 నుంచి ఆగస్టు 25న సాయంత్రం 5 గంటల వరకు తెలపాల్సి ఉంటుందని కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అభ్యంతరాలు నమోదుచేయాలని కమిషన్ స్పష్టంచేసింది.


తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీల భర్తీకి టీఎస్‌పీఎస్సీ గతేడాది డిసెంబరు 31 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 78 పోస్టులకు భర్తీచేయనున్నారు. వీటిలో అకౌంట్స్ ఆఫీసర్-01, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్-13, సీనియర్ అకౌంటెంట్-64 పోస్టులు ఉన్నాయి. కామర్స్  డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి ఈ ఏడాది జనవరి 20 నుంచి ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తులు స్వీకరించారు.  ఆగస్టు 8న ఈ పోస్టుల భర్తీకి రాతపరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. 


Download Response Sheet for CBRT Exam


MASTER QUESTION PAPERS


ALSO READ:


హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో 276 సీనియర్ ఆఫీసర్, ఇంజినీరింగ్‌ పోస్టులు
ముంబయిలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్‌) సీనియర్ ఆఫీసర్, ఇంజినీరింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  దీనిద్వారా మొత్తం 276 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్‌, ఎంబీబీఎస్‌, సీఏ, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


నార్తర్న్ రైల్వేలో 93 సీనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నార్తర్న్ రైల్వే కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ టెక్నికల్ అసోసియేట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హతతోపాటు గేట్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆగస్టు 28 లోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయించారు.అకడమిక్ మెరిట్, అర్హతల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.  
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 45 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్‌ కార్యాలయాలు/ యూనిట్లలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 45 మేనేజ్‌మెంట్ ట్రైనీ, వెల్ఫేర్‌ ఆఫీసర్‌, జేఎం పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..