తెలంగాణలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి 12న నిర్వహించనున్న రాతపరీక్ష వాయిదాపడింది. అదేరోజు గేట్-2023 పరీక్ష ఉన్న కారణంగా, అభ్యర్థుల సౌకర్యార్థం అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పరీక్షను వాయిదావేసినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా, ఏఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మార్చి 5న పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్ వెల్లడించింది. 


తెలంగాణలో వివిధ ఇంజినీరింగ్ సర్వీసుల్లో 837 అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్  పోస్టుల భ‌ర్తీకి సెప్టెంబరు 12న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ/డిప్లొమా అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి సెప్టెంబరు 28 నుంచి 21 వరకు దరఖాస్తులు స్వీకరించింది. మొదట 833 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయగా.. భూగర్భజలశాఖ పరిధిలో నాలుగు డ్రిల్లింగ్ సూపర్ వైజర్ (మెకానికల్) పోస్టులను జతచేసింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 837కి చేరినట్టయింది.  



 పరీక్ష విధానం: మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 300 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్)-150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2 అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి-150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి.



పోస్టుల వివరాలు..


మొత్తం ఖాళీలు: 837


* అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్: 434 పోస్టులు 


విభాగాలవారీగా పోస్టుల వివరాలు..


1)  అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్):  62 పోస్టులు


2)  అసిస్టెంట్ ఇంజినీర్: 41 పోస్టులు


3) అసిస్టెంట్ ఇంజినీర్: 13 పోస్టులు


4) మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్): 29 పోస్టులు


5) టెక్నికల్ ఆఫీసర్: 09 పోస్టులు


6)  అసిస్టెంట్ ఇంజినీర్: 03 పోస్టులు


7) అసిస్టెంట్ ఇంజినీర్: 227 పోస్టులు


8) అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్): 12 పోస్టులు


9)  అసిస్టెంట్ ఇంజినీర్: 38 పోస్టులు


10) అసిస్టెంట్ ఇంజినీర్: 38 పోస్టులు


* జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 399 పోస్టులు


విభాగాలవారీగా పోస్టుల వివరాలు..


1) జూనియర్ టెక్నికల్ ఆఫీసర్:  27 పోస్టులు


2) జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 68 పోస్టులు


3) జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 32 పోస్టులు


4) జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 212 పోస్టులు


5) జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 60 పోస్టులు 


* డ్రిల్లింగ్ సూపర్ వైజర్ (మెకానికల్) : 4 పోస్టులు


Notification


ముఖ్యమైన తేదీలు...


➥ సంక్షిప్త ప్రకటన: 12.09.2022.


➥ పూర్తినోటిఫికేషన్ వెల్లడి: 23.09.2022.


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.09.2022


➥ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది: 21.10.2022.


పరీక్ష తేది: 05.03.2023.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...