TSPSC Librarian Application: లైబ్రేరియన్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం! అప్లికేషన్ లింక్ ఇదే! చివరితేది ఎప్పుడంటే?

ఏదైనా డిగ్రీతోపాటు సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జనవరి 21న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Continues below advertisement

తెలంగాణలోని ఇంటర్, సాంకేతిక విద్యలో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 31 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 71 లైబ్రేరియన్ పోస్టులకు భర్తీచేయనున్నారు. వీటిలో ఇంటర్మీడియట్ ఎడ్యకేషన్ పరిధిలో 40 పోస్టులు, టెక్నికల్ ఎడ్యకేషన్ పరిధిలో 31 పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీతోపాటు సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 21న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఖాళీల భర్తీ ఎంపిక చేపడతారు. 

Continues below advertisement

పోస్టుల వివరాలు..

* లైబ్రేరియన్ 

ఖాళీల సంఖ్య: 71

విభాగాల వారీగా ఖాళీలు: 

1) లైబ్రేరియన్: 40 పోస్టులు

విభాగం: అండర్ ది కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యకేషన్.

2) లైబ్రేరియన్: 31 పోస్టులు

విభాగం: అండర్ ది కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యకేషన్.

అర్హతలు..

⏩ లైబ్రేరియన్ ఇంటర్మీడియట్ ఎడ్యకేషన్ పోస్టులకు ఏదైనా డిగ్రీతోపాటు 50 శాతం మార్కులకు తగ్గకుండా పీజీ డిగ్రీ (లైబ్రరీ సైన్స్) ఉండాలి.

⏩ లైబ్రేరియన్ టెక్నికల్ ఎడ్యకేషన్ పోస్టులకు లెవల్-9ఎ విభాగానికి చెందినవారైతే మాస్టర్స్ డిగ్రీ (లైబ్రరీ సైన్స్/ ఇన్‌ఫర్మేషన్ సైన్స్/డాక్యుమెంటేషన్ సైన్స్) లేదా తత్సమాన ప్రొఫెషనల్ డిగ్రీ అర్హత ఉండాలి. యూజీసీ నెట్ లేదా యూజీసీ గుర్తింపు పొందిన ఏదైనా అర్హత పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఇక లెవల్-10 పోస్టులకు మాస్టర్స్ డిగ్రీతోపాటు నెట్/ సీఎస్‌ఐర్ నెట్/స్లెట్/సెట్  లేదా పీహెచ్‌డీ ఉండాలి.

వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1983 - 01.07.2001 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.320. ఇందులో రూ.200 ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజు కింద, రూ.120 పరీక్ష ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు పరీక్ష ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష ఆధారంగా.

జీతం: 

⏩లైబ్రేరియన్ ఇంటర్మీడియట్ ఎడ్యకేషన్ పోస్టులకు రూ.54,220 - రూ.1,33,630.

⏩ లైబ్రేరియన్ టెక్నికల్ ఎడ్యకేషన్ పోస్టులకు లెవల్-9ఎ అర్హతకు రూ.56,100,  లెవల్-10 అర్హత ఉన్నవారికి రూ.57,700 ఇస్తారు.

పరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్): 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2 (లైబ్రరీ & ఇన్‌ఫర్మేషన్ సైన్స్ - ఎంఎల్‌ఐఎస్సీ స్థాయి): 150 ప్రశ్నలు-300 మార్కులు ఉంటాయి. పేపర్-1లో ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు, పేపర్-2లో ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. పేపర్-1 ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగులోనూ, పేపర్-2 ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.01.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.02.2023.

Online Application

Notification

Website

Also Read:

అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్ దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వ రవాణా విభాగంలో 113 అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 12న ప్రారంభమైంది. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 1న సాయంత్రం 5 గంటల్లోపు పరీక్ష ఫీజు చెల్లించి, దరఖాస్తులు సమర్పించవచ్చు.   ఏప్రిల్‌ 23న రాతపరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం పోస్టుల్లో పురుషులకు 72 పోస్టులు, మహిళలకు 41 పోస్టులు కేటాయించారు. 
దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..

గ్రూప్-2 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే? పోస్టుల పూర్తి వివరాలు ఇలా!
తెలంగాణలో ఖాళీగా ఉన్న 783 'గ్రూప్-2' పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 29న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 18న ప్రారంభమైంది. అభ్యర్థులు ఫిబ్రవరి 16న సాయంత్రం 5 గంటల వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కొన్ని పోస్టులకు పీజీ డిగ్రీ, డిప్లొమా అర్హత కూడా ఉండాలి. అభ్యర్థులు ఫీజుగా రూ.320 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రూ.200 ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజు కింద, రూ.120 పరీక్ష ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు పరీక్ష ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ 'గ్రూప్-3' నోటిఫికేషన్ వచ్చేసింది, 1365 ఖాళీల భర్తీకి 24 నుంచి దరఖాస్తులు!
తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతూనే ఉంది. వరుసపెట్టి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబరు 30న గ్రూప్-3 నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1365 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వివిధ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, సీనియర్ ఆడిటర్, అసిస్టెంట్ ఆడిటర్, అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్-3 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 24 నుంచి ప్రారంభంకానుంది. పోస్టుల అర్హతలు, ఇతర వివరాలను జనవరి 24 నుంచే పూర్తి నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 23 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Continues below advertisement
Sponsored Links by Taboola