తెలంగాణలో గ్రూప్-2 ఉద్యోగాాల భర్తీకి నిర్వహించనున్న పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ ఫిబ్రవరి 28న విడుదల చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనుంది. పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూలును త్వరలోనే ప్రకటించనున్నారు. పరీక్షలకు వారం ముందునుంచి హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు కమిషన్ ప్రకటించింది.
5,51,943 దరఖాస్తులు..
తెలంగాణలో గ్రూప్-2 పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 16తో ముగిసిన సంగతి తెలిసిందే. గ్రూప్-2 పోస్టులకు మొత్తం 5,51,943 దరఖాస్తులు అందాయి. అందినట్లు టీఎస్‌పీఎస్‌సీ అధికారులు ప్రకటించారు. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. చివరి మూడు రోజుల్లోనే 1.10లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం. చివరి రోజు 68వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్-2 పరీక్షకు ఒక్కో పోస్టుకు సగటున 705 మందికి చొప్పున పోటీ పడనున్నారు.
మొత్తం 783 గ్రూప్-2 పోస్టులకు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దీనికి జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అయితే గ్రూప్-2 పరీక్ష తేదీను మాత్రం టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించలేదు. త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. అంతా కుదిరితే వారంరోజుల్లో పరీక్ష తేది వెల్లడించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇతర పోటీ పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పరీక్షా తేదీని అధికారులు వెల్లడించనున్నారు.
గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, తహసిల్దార్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
పోస్టుల వివరాలు...
* గ్రూప్-2 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 783
1) మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-3): 11 పోస్టులు
విభాగం: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్.
2) అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (ఏసీటీవో): 59 పోస్టులు
విభాగం: కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్సెస్ డిపార్ట్‌మెంట్.
3) నాయబ్ తహసిల్దార్: 98 పోస్టులు
విభాగం: ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్.
4) సబ్-రిజిస్ట్రార్ (గ్రేడ్-2): 14 పోస్టులు
విభాగం: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్‌మెంట్.
5) అసిస్టెంట్ రిజిస్ట్రార్: 63 పోస్టులు
విభాగం: కంట్రోల్ ఆఫ్ కమిషనర్- కోఆపరేషన్ & రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్.
6) అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్: 09 పోస్టులు
విభాగం: కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్‌మెంట్.
7) మండల్ పంచాయత్ ఆఫీసర్: 126 పోస్టులు
విభాగం: పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్.
8) ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్: 97 పోస్టులు
విభాగం: ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్.
9) అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 38 పోస్టులు
విభాగం: హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ డిపార్ట్‌మెంట్.
10) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 165 పోస్టులు
విభాగం: జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్.
11) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 15 పోస్టులు
విభాగం: లెజిస్లేటివ్ సెక్రటేరియట్.
12) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 25 పోస్టులు
విభాగం: ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్.
13) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 07 పోస్టులు
విభాగం: లా డిపార్ట్‌మెంట్.
14) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 02 పోస్టులు
విభాగం: తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్.
15) డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ (గ్రేడ్-2): 11 పోస్టులు
విభాగం: జువైనల్ కరెక్షనల్ సర్వీసెస్ & వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ డిపార్ట్‌మెంట్.
16) అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 17 పోస్టులు
విభాగం: బీసీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్.
17) అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 09 పోస్టులు
విభాగం: ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్.
18) అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ ఎస్సీ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 17 పోస్టులు
విభాగం: ఎస్సీ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్.
గ్రూప్-2 నోటిఫికేషన్, పరీక్ష స్వరూపం కోసం క్లిక్ చేయండి..