తెలంగాణ రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్‌సీ రద్దు చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులకు హెవీ లైసెన్స్ ఉండాలన్న నిబంధనపై పలు అభ్యంతరాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా అర్హతల విషయంలోనూ పలు విజ్ఞప్తులు వచ్చాయని.. వాటిని రవాణా శాఖకు తెలియజేసినట్లు కమిషన్ వెల్లడించింది. కారణం ఇదే..ఈ నోటిఫికేషన్ అర్హతల గురించి మహిళా అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆటోమొబైల్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనిలో పాటు.. హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తప్పనిసరిగా ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అయితే ఈ పోస్టులకు లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్ అడగకుండా.. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అడగటం ఏంటని.. అది కూడా మహిళలు ఈ లైసెన్స్ తీసుకోవడం ఎలా సాధ్యమవుతుందని అభ్యంతరాలు రావడంతో దరఖాస్తు ప్రక్రియ ఆగిపోయింది.
Also Read: SBI Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 714 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు, అర్హతలివే!భారత ప్రభుత్వరంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్(ఎస్‌సీఓ) పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 20 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. షార్ట్‌లిస్టింగ్ కమ్ ఇంట్రాక్షన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌లో 226 ఉద్యోగాలు, వివరాలు ఇలా!తమిళనాడులోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ (NLC) ఇండియా లిమిటెడ్ పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 226 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్ పోస్టులకు నియామకాలు చేపట్టనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..