తెలంగాణలోని పలు విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్ష తేదీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది (2023) ఫిబ్రవరి 12న రాతపరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను పరీక్షకు వారంరోజుల ముందు నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
తెలంగాణ పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ మిషన్ భగీరథ(సివిల్), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్ హెల్త్; ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్, ఇరిగేషన్ & కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్, ట్రాన్స్‌పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ విభాగాల్లో 833 అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 12న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ వెల్లడించింన సంగతి తెలిసిందే. ఖాళీల భర్తీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ సెప్టెంబరు 23 నుంచి అందుబాటులో ఉంచింది. అభ్యర్థుల నుంచి సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 21 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించింది.
పరీక్ష విధానం:
🔰 మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 300 ప్రశ్నలు ఉంటాయి.
🔰 ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్): 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి.
🔰 పేపర్-2 (సివిల్ ఇంజినీరింగ్/మెకానికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్) నుంచి 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి.
🔰 ఒక్కో పేపర్‌కు 150 నిమిషాల సమయం కేటాయిస్తారు.
Also Read:
రిజర్వేషన్ల సమస్య కొలిక్కి, ఊపందుకోనున్న నియామకాలు!
తెలంగాణలో రిజర్వేషన్ల సమస్య కొలిక్కి వచ్చింది. దీంతో నియామకాలకు లైన్ క్లియర్ అయింది. తాజాగా గిరిజన రిజర్వేషన్ల పెంపుతోపాటు, రోస్టర్ పాయింట్ల ఖరారు వంటి చర్యలు పూర్తవడంతో నియామకాల ప్రక్రియ ఊపందుకోనుంది. 'గ్రూప్-1' కీ విడుదల నేపథ్యంలో మెయిన్స్ పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. సీఎం కేసీఆర్ ప్రకటించిన 80 వేల ఖాళీల్లో ఇప్పటికే మెజార్టీ ఉద్యోగాలకు ఆర్ధికశాఖ అనుమతులను జారీ చేసింది. అదేవిధంగా ఓసీలకు 44 ఏళ్లు; బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్ల వరకు వయోపరిమితిని ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. దీంతో ఉద్యోగాలకు పోటీ మరింత పెరిగినట్లయింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టుల ముహూర్తం ఖరారు, ఈవెంట్లు ఎప్పుడంటే?
తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన ఫిజికల్ ఈవెంట్లకు తెలంగాణ పోలీసు నియామక మండలి ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ) నిర్వహణకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారు చేసింది. డిసెంబరు మొదటి వారంలో ఈవెంట్లు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 12 కేంద్రాలను ఎంపిక చేసింది. వాటిలో అన్ని రకాల సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..