తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్ష వాయిదా గురించి వస్తున్న పుకార్లకు ప్రభుత్వం ఫుల్‌స్టాప్ పెట్టింది. షెడ్యూల్‌ ప్రకారమే గ్రూప్-2 పరీక్ష జరుగుతుందని ఆదివారం (జులై 6) అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన  ప్రకటనతో స్పష్టత వచ్చినట్లయింది. గ్రూప్‌-2 పరీక్ష వాయిదా వేయాలని ఇటీవల కొంతమంది టీఎస్‌పీఎస్సీని ఆశ్రయించారు. షెడ్యూల్‌ ప్రకారమే పరీక్ష నిర్వహించాలని మరికొందరు కమిషన్‌ను కోరారు. అక్టోబర్‌లో దసరా సెలవులు ఉండటం, ఆ తర్వాత నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో షెడ్యూల్‌ ప్రకారమే 'గ్రూప్‌-2' పరీక్ష నిర్వహించాలని అభ్యర్థిస్తున్నారు. దీంతో టీఎస్‌పీఎస్సీ సైతం ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించాలని భావిస్తోంది.


ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో కొందరు సభ్యులు సైతం గ్రూప్‌-2 వాయిదా వేయాలని కోరారు. ఈ నేపథ్యంలో సీఎస్‌ శాంతికుమారితో సీఎం కేసీఆర్‌ చర్చించారు. అన్నీ పరిశీలించిన తర్వాత గ్రూప్‌-2 పరీక్ష యథావిధిగా కొనసాగుతుందని సీఎం ప్రకటించారు. పరీక్షకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, మిగిలిన పరీక్షల నిర్వహణపై మరోసారి అధికారులతో చర్చించాలని సీఎస్‌ను సీఎం ఆదేశించారు.


టీఎస్‌పీఎస్సీ కొన్ని నెలల క్రితమే పరీక్ష తేదీని ప్రకటించింది. ఈ ప‌రీక్ష నిర్వహ‌ణ‌కు కమిషన్ కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. పరీక్ష నిర్వహణ, కేంద్రాలు తదితర అంశాలపై టీఎస్‌పీఎస్సీ ఇప్పటి నుంచే కసరత్తు చేసింది. కలెక్టర్లు, పోలీస్‌ ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించింది. గ్రూప్‌-2 నిర్వహించనున్న కేంద్రాలకు పరీక్ష తేదీలైన ఆగస్టు 29, 30 తేదీల్లో విద్యాశాఖ సెలవు ప్రకటించింది. 


ఇదిలా ఉండగా.. గ్రూప్‌-1 మెయిన్స్‌ తేదీల ఖరారు టీఎస్‌పీఎస్సీకి పెద్ద పరీక్షగా మారింది. ఇలాంటి తరుణంలో మరో ప్రధాన పరీక్షను వాయిదా వేయడం సాధ్యంకాదని ఇటీవల జరిగిన సమావేశంలో కమిషన్‌ అభిప్రాయపడింది. ఒకసారి పరీక్షను వాయిదావేస్తే మళ్లీ ఈ ఏడాది నిర్వహించడం కష్టమేనని, కనుక ఆగస్టు 29, 30 తేదీల్లోనే గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించాలని కమిషన్‌ ఏకాభిప్రాయానికి వచ్చింది. రాష్ట్రస్థాయిలో గ్రూప్‌-1 తర్వాత అత్యంత కీలకమైనది గ్రూప్‌-2 ఉద్యోగమే. రాష్ట్రంలో గ్రూప్‌-2 కేటగిరీ కింద 18 విభాగాల్లో 783 ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్‌ 29న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. గ్రూప్‌-2 పోస్టులకు మొత్తం 5,51,943 మంది దరఖాస్తు చేశారు. అంటే.. సగటున ఒక్కో ఉద్యోగానికి 705 మంది పోటీ పడుతున్నారు.


గ్రూప్-2 పరీక్ష విధానం, సిలబస్ వివరాలు..


మొత్తం 600 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష (సీబీటీ) నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కులు కేటాయించారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు చొప్పున నాలుగు పేపర్లకు కలిపి 600 ప్రశ్నలకు 600 మార్కులు ఉంటాయి.


➥ పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్): 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి. 


➥ పేపర్-2 (హిస్టరీ, పాలిటీ & సొసైటీ): 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి.


➥ పేపర్-3 (ఎకానమీ & డెవలప్‌మెంట్): 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి.


➥ పేపర్-4 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్రావతారణ): 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి.  




గ్రూప్-2 నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ALSO READ:


ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో 650 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలు అవసరం
ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్(ఏఎఫ్‌ఎంఎస్‌) షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి సంక్షిప్త ఉద్యోగ ప్రకటన (షార్ట్ నోటిఫికేషన్)ను విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 650 మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో పురుషులకు 585 పోస్టులు, మహిళలకు 65 పోస్టులు కేటాయించారు. ఎంబీబీఎస్‌, పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్వ్యూ, ఫిజికల్, మెడికల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి. నోటిఫికేషన్‌ వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఆగస్టు 12 నుంచి సెప్టెంబరు 10 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


1324 జేఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఎంపికైతే జీతమెంతో తెలుసా?
కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్‌ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జులై 26 నోటిఫికేషన్  జారీచేసింది. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) పోస్టులను భర్తీ చేస్తారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు జులై 26 నుంచి ఆగస్టు 16 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..