తెలంగాణ తొలి 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీని గడువులోగా ప్రకటించేందుకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు చేస్తోంది. తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా అక్టోబరు 16న 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే పరీక్ష నిర్వహించిన ఎనిమిది పని దినాల్లో ప్రిలిమినరీ కీ విడుదలతో పాటు ఓఎంఆర్ పత్రాల ఇమేజ్ స్కానింగ్ పూర్తిచేస్తామని టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. కాగా నిర్ణీత గడువులోగా ఆన్సర్ కీని ప్రకటించేందుకు కమిషన్ సన్నాహాలు చేస్తోంది. అన్ని కుదిరితే ఈ వారంలోనే ఆన్సర్ 'కీ' వెలువడనుందని కమిషన్ వర్గాలు తెలిపాయి.


అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరగ్గా.. అభ్యర్థుల జవాబు పత్రాలన్నీ జిల్లాల నుంచి అక్టోబు 17న హైదరాబాద్‌కు చేరుకున్నాయి. అక్టోబరు 18 నుంచి అభ్యర్థుల OMR పత్రాల ఇమేజ్ స్కానింగ్ ప్రారంభమైంది. కమిషన్ ముందుగా ప్రకటించినట్లుగా 8 పనిదినాల్లో ప్రక్రియ పూర్తిచేయనుంది. అయితే ఇందులో పండగ సెలవుల్ని మినహాయించగా అక్టోబరు 29 లేదా 30 తేదీల్లో ప్రాథమిక కీ వెలువడే అవకాశం ఉంది. ప్రాథమిక కీపై అభ్యర్థుల నుంచి గడువులోగా అభ్యంతరాలు స్వీకరించి, తర్వాత ఫలితాలతోపాటు తుది ఆన్సర్ 'కీ'ని కమిషన్ విడుదల చేయనుంది.


పరీక్షకు 75 శాతం హాజరు..
తెలంగాణలో అక్టోబరు 16న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు మొత్తం 75శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 503 గ్రూప్-1 పోస్టులకు గాను.. 3.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్‌-1 పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 1019 పరీక్ష కేంద్రాల్ని ఏర్పాటు చేయగా.. 2,86,051 అభ్యర్థులు హాజరయ్యారు. హైదరాబాద్‌లోనే 100 వరకు ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటుచేశారు. ఎనిమిది రోజుల్లో ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తర్వాత ప్రాథమిక కీ విడుదల చేస్తామని టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. 


కటాఫ్ మార్కులు లేవు..
తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష కటాఫ్ మార్కులపై సామాజిక మాధ్యమాల్లో వార్తలు చెక్కర్లు కొట్టాయి. ఈ ప్రచారంపై టీఎస్‌పీఎస్సీ అధికారులు అక్టోబరు 17న స్పష్టత ఇచ్చారు. 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష కేవలం  స్క్రీనింగ్ పరీక్ష మాత్రమేనని, ఇందులో ఎలాంటి కనీస అర్హత మార్కులు ఉండవని ప్రకటించింది. మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక విధానంలో మార్పులు జరిగాయని వివరించింది. గతంలో మార్కుల ప్రాతిపదికన ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేసే విధానం ఉండేదని పేర్కొంది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ 25న ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం.. మల్టీ జోన్ వారీగా రిజర్వేషన్ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేస్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.


 


:: ALSO READ ::


AP High Court Jobs: ఏపీలో 3673 కోర్టు ఉద్యోగాలు, ఈ అర్హతలు ఉండాలి!
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు ఏపీ హైకోర్టు గుడ్ న్యూస్ తెలిపింది. అమరావతిలోని ఏపీ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం 19 రకాల నోటిఫికేషన్‌ల ద్వారా 3673 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. వీటిల్లో హైకోర్టు పరిధిలో 241 పోస్టులు ఉండగా, రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టుల్లో 3432 ఖాళీలు ఉన్నాయి.
నోటిఫికేషన్లు, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇండియన్ నేవీలో ఆఫీసర్ పోస్టులు, ప్రారంభ జీతం రూ.56,100
భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహిత పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అకడమిక్ మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ఎంపికైనవారికి కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో జూన్ 2023 ప్రారంభమయ్యే 23వ కోర్సులో సంబంధిత శాఖలు/ కేడర్/ స్పెషలైజేషన్లలో శిక్షణ ఇస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1422 ఉద్యోగాలు, పూర్తి వివరాలివే!
ముంబయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్ సెంటర్ దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ సర్కిళ్లలో 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్(సీబీవో) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. హైదరాబాద్ సర్కిల్‌లో 176 ఖాళీలున్నాయి. ఎంపికైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సర్కిల్/ రాష్ట్రంలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...