తెలంగాణలో పోలీసు కానిస్టేబుల్, ఎస్‌ఐ ప్రిలిమినరీ రాతపరీక్షలో అర్హత సాధించి ఫిజికల్ మెజర్ మెంట్ టెస్ట్ (పీఎంటీ)/ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ) పరీక్షకు సంబంధించి అక్టోబరు 27న ప్రారంభమైన 'పార్ట్-2' దరఖాస్తు ప్రక్రియ నవంబరు 10తో ముగిసింది. కానిస్టేబుల్, ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌ ద్వారా పార్ట్-2 రిజిస్ట్రేషన్ పూర్తిచేశారు. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గడువును పొడగించమని అధికారులు ముందుగానే స్పష్టం చేయడంతో.. నవంబరు 10తో రిజిస్ట్రేషన్ గడువు ముగిసింది. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు పలువురు అభ్యర్థులు అర్హత సాధించిన నేపథ్యంలో 2,37,862 లక్షల మంది పార్ట్‌-2 దరఖాస్తులను సమర్పించిటన్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. వీరిలో 1,91,363 మంది పురుషులు; 46,499 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. పీఎంటీ, పీఈటీల వేదికలు, తేదీల గురించి అభ్యర్థులకు ఇంటిమేషన్ లెటర్లు పంపించనున్నారు.


పార్ట్-2 రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఎస్సై సివిల్ పోస్టులకు 1.01 లక్షలు, కానిస్టేబుల్ పోస్టులకు 1.76 లక్షలు, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు 1.06లక్షలు, ట్రాన్స్ పోర్ట్ కానిస్టేబుల్ పోస్టులకు 17,176 మంది దరఖాస్తులు సమర్పించారు. నాన్ టెక్నికల్ పోస్టులు కాకుండా.. 4లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అంటే 96 శాతం మంది దరఖాస్తులు చేసుకున్నారు.టెక్నికల్ పోస్టులతో కలుపుకుంటే మొత్తం 4,63,970 దరఖాస్తులు వచ్చినట్లు ప్రకటనలో వెల్లడించారు. 91 శాతం మంది పార్ట్ 2 అప్లికేషన్స్ చేసుకున్నట్లు తెలిపారు.



పార్ట్-2 దరఖాస్తుల సవరణకు అవకాశం..
పార్ట్-2 దరఖాస్తు సమయంలో అభ్యర్థులు ఏమైనా పొరపాట్లు చేసినట్లయితే, దరఖాస్తు సవరణకు అవకాశం కల్పించనున్నట్లు నియామక బోర్డు తెలిపింది. ఇందుకోసం అభ్యర్థులకు తగినంత సమయం ఇవ్వనున్నట్లు తెలిపింది. లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో వివరాలు సవరించుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు స్పష్టం చేసింది.


11, 12 మైదానాల్లో ఫిజికల్ ఈవెంట్లు..
రాష్ట్రవ్యాప్తంగా 11, 12 వేదికల్లో/ మైదానాల్లో ఫిజికల్ నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్లగొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్‌తోపాటు మరో ఒకటి రెండు కొత్త ప్రదేశాల్లో ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. 25 రోజుల్లో ఫిజికల్ ఈవెంట్ల ప్రక్రియను ముగించాలని అధికారులు భావిస్తున్నారు.


త్వరలో అడ్మిట్ కార్డు...
ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించిన అడ్మిట్ కార్డులను త్వరలో వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు. అడ్మిట్ కార్డు ఉంటేనే ఫిజికల్ ఈవెంట్లకు అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈవెంట్లకు హాజరయ్యే వారు అవసరమైన అన్ని ధ్రువపత్రాలను వెంటతీసుకెళ్లాల్సి ఉంటుంది.
అడ్మిట్ కార్డు 
గుర్తింపు కోసం బయోమెట్రిక్ వెరిఫికేషన్ 
సెల్ఫ్ అటెస్టెడ్ ఫొటోకాపీ (క్యాస్ట్ సర్టిఫికేట్) సమర్పించాలి. 
➢  ఎక్స్-సర్వీస్‌మెన్ సర్టిఫికేట్/ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ - సెల్ఫ్ అటెస్టెడ్ ఫొటోకాపీ సమర్పించాలి. 
ఆదివాసి గిరిజన ప్రాంతానికి చెందినవారైతే ప్రభుత్వం జారీచేసిన ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్ సమర్పించాలి. 


ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ఈవెంట్లు ఇలా..
ఫిజికల్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థులకు మొదట పరుగు పందెం నిర్వహిస్తారు. పురుషులు 1,600 మీటర్లు, మహిళా అభ్యర్థులు 800 మీటర్ల పరుగును పూర్తి చేయాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలో పరుగు పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో లాంగ్‌జంప్‌, షాట్‌పుట్ పోటీలు నిర్వహిస్తారు. వీటన్నింటిలోనూ అర్హత సాధిస్తేనే తుది రాతపరీక్షకు అర్హులుగా పరిగణిస్తారు. వీరికి మాత్రమే ఫైనల్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జారీ చేసి, పరీక్ష నిర్వహిస్తారు.


రాష్ట్రవ్యాప్తంగా 554 ఎస్‌ఐ పోస్టులకు  ఆగస్టు 7న, అలాగే 16,321 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆగస్టు 28న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎస్‌ఐ రాతపరీక్షకు 2,47,217 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,25,759 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక కానిస్టేబుల్ పరీక్షకు మొత్తం 6,61,196 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 6,03,955 మంది అభ్యర్థులు హాజరయ్యారు.




:: Also Read ::


ECIL Walkin: ఈసీఐఎల్‌‌లో 70 టెక్నికల్‌ ఆఫీసర్ పోస్టులు! వాక్‌ఇన్ షెడ్యూలు ఇదే!
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) టెక్నికల్‌ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్ నిర్వహిస్తోంది. బీఈ, బీటెక్ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నవంబరు 13, 14 తేదీల్లో వాక్‌ఇన్ నిర్వహించనున్నారు. అర్హతలు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిచేస్తారు. హైదరాబాద్‌‌లోని ఈసీఐఎల్ క్యాంపస్‌లో వాక్‌ఇన్ నిర్వహించనున్నారు.
వాక్ ఇన్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


డీఆర్‌డీవో ఉద్యోగాలకు ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ, చివరితేది ఎప్పుడంటే?
భార‌త ర‌క్షణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన డిఫెన్స్ రిసెర్చ్ & డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గనేజేష‌న్(డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని సెంట‌ర్ ఫ‌ర్ ప‌ర్సన‌ల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టం) గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్‌డీవో పరిశోధనా కేంద్రాల్లో 1061 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...