తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ(టీఎస్‌ఈఎస్‌) 2023-24 విద్యా సంత్సరానికి రాష్ట్రంలోని 23 ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి తాత్కాలిక ప్రాతిపదికన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. బోధనతో పాటు రెసిడెన్షియల్‌ పాఠశాల విధులకు హాజరుకావడం తప్పనిసరి. షేరింగ్‌ ప్రాతిపదికన బోర్డింగ్‌, లాడ్జింగ్‌ పాఠశాల క్యాంపస్‌లో అందుబాటులో ఉండేలా సదుపాయం ఉంటుంది. ఎంపికైన ఉపాధ్యాయులు సీబీఎస్‌ఈ సిలబస్‌ను ఆంగ్లభాషలో బోధించాల్సి ఉంటుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు జులై 02వ తేదీలోగా ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 


వివరాలు..


మొత్తం ఖాళీలు: 239.


⏩ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు (పీజీటీ)


➥ ఇంగ్లిష్: 15


➥ హిందీ: 09


➥ గణితం: 11


➥ భౌతికశాస్త్రం: 18


➥ కెమిస్ట్రీ: 05


➥ జీవశాస్త్రం: 13


➥ చరిత్ర: 16


➥ భూగోళశాస్త్రం: 17


➥ కామర్స్‌: 05


➥ ఎకనామిక్స్‌: 10


➥ తెలుగు: 07


➥ ఐటీ: 13


⏩ ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్ (టీజీటీ)


➥ ఇంగ్లిష్: 27


➥ హిందీ: 12


➥ తెలుగు: 17


➥ గణితం: 14


➥ సైన్స్: 19


➥ సోషల్‌ సైన్సెస్‌: 11


అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీఈడీ, పీహెచ్‌డీ, ఎంఫిల్, ఎంఈడీ, టెట్‌ ఉత్తీర్ణతతో పాటు బోధననానుభవం కలిగి ఉండాలి.


గరిష్ఠ వయోపరిమితి: 01.07.2023 నాటికి 60 సంవత్సరాలు మించకూడదు.


జీతం: నెలకు పీజీటీలకు రూ.35,750; టీజీటీలకు రూ.34,125.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి.


దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు.


ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, బోధన అనుభవం, డెమో తదితరాల ఆధారంగా.


ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02.07.2023.


Notification 


online submission


Website


ALSO READ:


తెలంగాణ కేజీబీవీల్లో 1,241 ఉద్యోగాలు, దరఖాస్తులు ఎప్పుడంటే?
తెలంగాణలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ (యూఆర్‌ఎఎస్‌)లో ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేజీబీవీ, యూఆర్‌ఎస్‌లో మొత్తం 1,241 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ జూన్ 16న ప్రకటన జారీ చేసింది. కేజీబీవీల్లో స్పెషల్‌ ఆఫీసర్‌, పీజీసీఆర్‌టీ, సీఆర్‌టీ, పీఈటీలు, అర్బన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో స్పెషల్‌ ఆఫీసర్‌, సీఆర్‌టీల ఖాళీలను కాంట్రాక్ట్‌ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులని ప్రభుత్వం పేర్కొంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో 43 ఐటీ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(ఐపీపీబీ) ఒప్పంద ప్రాతిపదికన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 43 పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఈ, బీటెక్‌(కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనప్పటికి జులై 03 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..