Telangana TET Results 2025 | హైదరాబాద్‌: టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్(TG TET 2025) ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మంగళవారం (జులై 22న) ఉదయం 11 గంటలకు టెట్ ఫలితాలు విడుదల చేశారు. 33.98 శాతం మంది టెట్ లో అర్హత సాధించారు. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://tgtet.aptonline.in/tgtet/లో ఫలితాలు చెక్ చేసుకోవాలని సూచించారు. ఫలితాల కోసం క్లిక్ చేయండి

తెలంగాణ టెట్‌ ఫలితాలు (TS TET 2025 Results)- 30,649 మంది ఉత్తీర్ణత

90,205 మంది తెలంగాణ టెట్ ఎగ్జామ్స్‌కు హాజరుకాగా  30,649 మంది ఉత్తీర్ణత సాధించారు. జూన్‌ 18 నుంచి 30వ తేదీల మధ్య ఆన్‌లైన్‌ లో తెలంగాణ టెట్ పరీక్షలు నిర్వహించడం తెలిసిందే. గత నెలలో జరిగిన టెట్ పరీక్షలకు దాదాపు 1 లక్షా 37 వేల మంది దరఖాస్తు చేసుకోగా, 90 వేల మంది హాజరయ్యారు. హాల్ టికెట్ నెంబర్, ఎగ్జామ్ పేపర్ వివరాలతో డేటాఫ్ బర్త్ ఎంటర్ చేసి టెట్ అభ్యర్థులు ఫలితాలు పొందవచ్చు అని అధికారులు తెలిపారు. Click Here to get TS TET 2025 Results

ఏప్రిల్15 న టెట్ నోటిఫికేషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. టెట్ అర్హతల విషయానికి వస్తే పేపర్-1కు డీఎడ్, పేపర్-2కు బీఎడ్ పూర్తి చేసి ఉండాలి. వారు మాత్రమే దరఖాస్తు చేయడానికి అర్హులు. స్కూల్ అసిస్టెంట్‌గా ప్రమోషన్లకు సైతం టెట్ (TET) అర్హతను ప్రామాణికంగా నిర్ణయించడంతో ఇన్ సర్వీస్ టీచర్లు కూడా టెట్ పరీక్షలకు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత మే పరీక్షతో కలుపుకొని ఆరుసార్లు పరీక్షలు నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదిన్నరలోపే రెండోసారి టెట్‌‌ను నిర్వహించింది.   https://tgtet.aptonline.in/tgtet/ResultFront 

టెట్ పరీక్ష విధానం: టెట్ పరీక్షలలో పేపర్ 1, పేపర్ 2లలో ఒక్కో పేపరులో 150 ప్రశ్నలు ఉంటాయి. 150 మార్కులకు ఒక్కో ఎగ్జామ్స్ నిర్వహించారు. టెట్ పేపర్-1లో 5 విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగంలో 30 ప్రశ్నలు ఉండగా.. ఒక్క ప్రశ్నకు ఒక్క మార్కు కేటాయించారు. ఇక పేపర్-2లో 4 విభాగాలు ఉంటాయి. వీటిలో మొదటి 3 విభాగాల్లో 30 ప్రశ్నలకు 30 మార్కులు, 4వ విభాగంలో 60 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్క మార్కు కేటాయించారు. 

టెట్ పరీక్షల్లో అర్హత మార్కులు ఇలా ఉన్నాయి. ఓసీలకు 60 శాతం మార్కులు రావాలి, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40 శాతం మార్కులను క్వాలిఫైగా నిర్ణయించారు. పరీక్షల్లో అర్హత మార్కులను ఓసీలకు 90,  బీసీలకు 75, ఎస్సీ-ఎస్టీ- దివ్యాంగులకు 60 మార్కులు రావాల్సి ఉంటుంది.