Mangal Gochar 2025: మంగళ (కుజ) గ్రహానికి అధిపతి మంగళ దేవుడు. జ్యోతిష్య శాస్త్రంలో కుజుడికి అత్యంత ముఖ్యమైన స్థానం ఉంది. మంగళ గ్రహం ధైర్యం, శక్తి ,  పరాక్రమాలకు సంబంధించినది.

ప్రస్తుతం కుజుడు..సూర్య రాశి అయిన సింహంలో సంచరిస్తున్నాడు. జూలై 27 , 2025న మంగళుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. మంగళుడిని ఉగ్రమైన, అగ్ని తత్వానికి చెందిన  కర్మశీలుడిగా భావిస్తారు. అందుకే కుజుడి సంచారం సమయంలో ప్రతికూల ప్రభావం ఉండే రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. 

మంగళ గోచరం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మంగళ గ్రహం ధైర్యం, శక్తి, పోరాటం, కోపం, శౌర్యం, భూమి వంటి విషయాలపై ప్రభావం చూపుతుంది. 2025లో మంగళ గోచరం సమయంలో మేష రాశి, కర్కాటక రాశి, తులా రాశి,  మకర రాశికి చెందిన వారిపై దీని ప్రభావం కనిపిస్తుంది. దీనివల్ల ఈ రాశుల వారు ఈ సమయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. 

కోపాన్ని అదుపులో ఉంచుకోండి

మంగళ గ్రహం ప్రభావంతో ఈ నాలుగురాశులవారికి కోపం పెరుగుతుంది. ఈ సమయంలో అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి, కోపాన్ని అదుపుచేసుకునేందుకు ప్రయత్నించాలి. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం మంగళ దోషం కారణంగా మాటల్లో కఠినత్వం , కోపం పెరుగుతుంది త్వరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు

మంగళ గ్రహం యొక్క తీవ్రత కారణంగా ఈ రాశుల వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. వివాహం, ఆస్తి, పెట్టుబడి వంటి విషయాలలో తొందరపడి తీసుకున్న నిర్ణయాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. మంగళ గోచారంలో తొందరపడి తీసుకున్న నిర్ణయాలు మిమ్మల్ని చాలా కాలం పాటు ప్రభావితం చేస్తాయి. 

వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి

మంగళ గ్రహానికి ప్రమాదాలు, రక్తం కూడా సంబంధం కలిగి ఉంటాయి. కుజుడి ప్రభావం ఎవరిపై ప్రతికూలంగా ఉంటుందో వారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుజుడి గోచారం ప్రతికూలంగా ఉన్న సమయంలో రక్తం కళ్లచూసే అవకాశం ఉంది, గాయాలపాలవుతారు.  శత్రువు లేదా కోర్టు కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండండి

మంగళుడు ఏడవ లేదా ఎనిమిదవ స్థానంలో ఉంటే మీ శత్రువులు పొంచి ఉన్నారు మీరు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. ఇలాంటి సమయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. దీనితో పాటు మంగళ మంత్రాలను జపించడం కూడా జీవితంలో శాంతిని కలిగిస్తుంది. 

మంగళ దోష నివారణ చర్యలు

మంగళ దోషం ఉన్నవారు ప్రతి మంగళవారం హనుమంతుడిని పూజించాలి. ఎరుపు రంగు దుస్తులు, సింధూరం సమర్పించాలి. దీనితో పాటు "ఓం క్రాం క్రీం క్రౌం సః భౌమాయ నమః" మంత్రాలను జపించాలి.

శివ శక్తి రేఖ: కేదార్‌నాథ్ నుంచి రామేశ్వరం వరకు ఒకే సరళ రేఖపై 7 శివాలయాలు ఎందుకున్నాయి - దీనివెనుకున్న రహస్యం ఏంటో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.