TS TET  2022 Topper From AP: తెలంగాణ టెట్ 2022 ఫలితాలలో ఆంధ్రప్రదేశ్ యువతి సత్తాచాటారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తిమ్మ సముద్రం గ్రామానికి చెందిన జంధ్యాల అంజని టీఎస్ టెట్ 2022 ఫలితాలలో టాప్ 5లో రెండు ర్యాంకులు సాధించారు. ఇటీవల విడుదలైన తెలంగాణ టెట్ పేపర్ 1 ఫలితాలలో స్టేట్ మొదటి ర్యాంకు సాధించగా.. రెండో పేపర్‌లో టాప్ 5 ర్యాంకులో నిలిచారు. పేపర్ 1లో ఆమెకు 133 మార్కులు రాగా, టీఎస్ టెట్ టాపర్‌గా అరుదైన ఘనత కాగా, బీఈడీ క్వాలిఫై వాళ్లు రెగ్యూలర్ గా రాసే పేపర్ 2 ఫలితాలలో 129 మార్కులతో 5వ ర్యాంకు అంజనీ కైవసం చేసుకున్నారు. టీచర్ జాబ్ కోసం ఎదురుచూస్తున్న ఏపీ అమ్మాయి అంజనీ.. ఏపీ టెట్ రాసేందుకు ప్రిపేర్ అవుతున్నారు. ఈమె తల్లిదండ్రులు ఇద్దరూ టీచర్లే కావడం విశేషం..


పేపర్ 1లో 32.68 శాతం, పేపర్ 2లో 49.64 శాతం క్వాలిఫై
తెలంగాణ టెట్‌ 2022ను షెడ్యూల్ ప్రకారం జూన్ 12వ నిర్వహించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో సుమారు 90 శాతం మంది టెట్ రాశారు. ఇందులో పేపర్‌-1 పరీక్షకు 3,18,444 90.62 శాతం మంది హాజరు కాగా, అందులో 32.68 క్వాలిఫై అయ్యారు. పేపర్ 1లో కేవలం 1,04,078 మంది మాత్రమే అర్హత సాధించారని టెట్ కన్వీనర్ వెల్లడించారు. పేపర్‌-2 పరీక్షను 2,50,897 మంది, 90.35 శాతం మంది అభ్యర్థులు హాజరు కాగా, అందులో 49.64 మంది క్వాలిఫై అయ్యారు. పేపర్ 2లో 1,24,535 మంది అర్హత సాధించారు. టీఎస్ టెట్ 2022 పేపర్ 2 రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి


తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET Results 2022) ఫలితాలయ్యాయి. టెట్ ఫలితాలను టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి నేటి ఉదయం 11:30 గంటల అనంతరం విడుదల చేశారు. టెట్ 2022 నిర్వహణకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా షెడ్యూల్ ప్రకారమే టెట్ నిర్వహించింది. రైల్వే రిక్రూట్ మెంట్ ఎగ్జామ్ (RRB) అదే రోజున ఉందని పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులు కోరినా విద్యాశాఖ మాత్రం నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈ క్రమంలో జూన్ 12న నిర్వహించిన టెట్ ఫలితాలు.. నోటిఫికేషన్ ప్రకారం జూన్ 27న విడుదల కావాల్సి ఉంది. కానీ టెట్ ఫలితాలు జూలై 1కి వాయిదా వేశారు. టీచర్ పోస్టుల కోసం ఎదరుచూస్తున్న అభ్యర్థులు టెట్ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టెట్ రాసిన అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://tstet.cgg.gov.in/ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. టీఎస్ టెట్ 2022 పేపర్ 1 రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి  


ఈ ఏడాది టెట్ అర్హతలు, నిర్వహణకు సంబంధించి కొన్ని మార్పులు జరిగాయి. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ మార్పులు చేసింది. గతంలో డిప్లొమా అభ్యర్థులు టెట్ పేపర్ 1 రాసేవారు. గతంలో బీఈడీ అభ్యర్థులు టెట్ పేపర్ 2 మాత్రమే రాసే అవకాశం ఉండేది.  కానీ ఈసారి బీఈడీ అభ్యర్థులు (B.ed Candidates) కూడా టెట్ పేపర్ 1 రాసే అవకాశం కల్పించారు.