తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఎస్ఐ రాత పరీక్ష ఆదివారం (ఆగస్టు 7) పోలీసుల బందోబస్తు మధ్య కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. హైదరాబాద్‌ సహా 20 పట్టణాల్లో 538 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. కోవిడ్‌ ప్రొటోకాల్‌ పాటిస్తూ.. అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. కొన్నిప్రాంతాల్లో దయచేసి లోపలికి పంపడంటూ అభ్యర్థులు వేడుకున్నారు. కానీ తామేం చేయలేమని అధికారులు చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు. 



ఉదయం 9 గంటల నుండి ఆయా పరీక్షా కేంద్రాల్లో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పరీక్షా కేంద్రానికి సుమారు 100 మీటర్ల దూరంలో వాహనాల పార్కింగ్ ను ఏర్పాటు చేసి అభ్యర్థుల తల్లిదండ్రులు సహాయకులను దూరంగా ఉంచారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక ఎస్ఐ, నలుగురు కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బందిని నియమించారు. పరీక్షా జరుగుతున్న సమయంలో పరీక్షా కేంద్రాలను పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సందర్శిస్తూ పకడ్బందీ నిఘాను ఏర్పాటు చేశారు. పరీక్ష జరుగుతున్న సమయంలో సమీపంలోని అన్ని జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు.

91.32  శాతం అభ్యర్థులు హాజరు...
రాష్ట్రంలో 554 ఎస్‌ఐ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా ఏకంగా 2,47,217 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిటో 2,25,759 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 91.32  శాతం ఉత్తీర్ణత నమోదైంది. అత్యధికంగా నల్లగొండ-1 రీజినల్ సెంటర్ నుంచి 96 శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా.. అత్యల్పంగా మేడ్చల్-5 రీజినల్ సెంటర్ నుంచి 75 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.

జిల్లాలవారీగా పరీక్షకు హాజరైన అభ్యర్థుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


ఆగస్టు 21న కానిస్టేబుల్ పరీక్ష..
తెలంగాణలో 15, 644 కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ప్రాథమిక రాత పరీక్షను ఆగస్టు 21న నిర్వహించనున్నారు. 21న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుంది. సివిల్‌తో పాటు ట్రాన్స్ పోర్ట్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆగస్టు 21న ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ తో పాటు 40 ప్రాంతాల్లో కానిస్టేబుల్ రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఆగస్టు 10 నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. కానిస్టేబుల్ పోస్టుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 6,50,000 మంది అప్లై చేసుకున్నారు. అభ్యర్థులు www.tslprb.in ద్వారా హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
               
తొలుత జూన్ ఆఖరులో లేదా జులై మొదటి వారంలో పరీక్ష నిర్వహించాలని భావించినా, వయోపరిమితిలో రెండేళ్ల సడలింపు ఇవ్వడంతో.. దరఖాస్తు గడువును పొడిగించారు. ఈ నేపథ్యంలో రెండు వారాలు ఆలస్యంగా రాత పరీక్ష నిర్వహించాలని బోర్డు అధికారులు నిర్ణయించారు. ప్రిలిమినరీ రాత పరీక్ష తరువాత అర్హులైన వారికి ఈవెంట్స్ నిర్వహించనున్నారు. ఇందులో క్వాలిపై అయిన వారికే మెయిన్స్ రాసేందుకు వీలవుతుంది. మెయిన్స్ ఫలితాలు వెలువడిన అనంతరం మెరిట్ ఆధారంగా తుది జాబితా రూపొందిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ లో ఎస్సై, కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్ వెలువడగా.. దీని ద్వారా 554  ఎస్సై, 15.644 సివిల్ కానిస్టేబుల్, 63 ట్రాన్స్ పోర్ట్ కానిస్టేబుల్, 614 ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయనున్నారు. 


Also Read: 


ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 282 టీజీటీ, పీజీటీ పోస్టులు - వివరాలు ఇవే!


టెన్త్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే!

విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో 319 ఉద్యోగాలు, వివరాలు ఇలా!


 


మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి...