తెలంగాణలో పోలీసు కానిస్టేబుల్, ఎస్‌ఐ ప్రిలమినరీ రాతపరీక్షలో అర్హత సాధించి ఫిజికల్ మెజర్ మెంట్ టెస్ట్ (పీఎంటీ)/ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ) పరీక్షకు సంబంధించిన 'పార్ట్-2' ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 27న ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కానిస్టేబుల్, ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌ ద్వారా నవంబరు 10న రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్టర్ ఫోన్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. 


ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గడువును పొడగించబోమని పోలీసు నియామక మండలి ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు పలువురు అర్హత సాధించిన నేపథ్యంలో దాదాపు 2.69 లక్షల మంది పార్ట్‌-2 దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందని మండలి వర్గాలు వెల్లడించాయి. ఈ దరఖాస్తుల స్వీకరణ అనంతరం పీఎంటీ, పీఈటీల వేదికలు, తేదీల గురించి అభ్యర్థులకు ఇంటిమేషన్ లెటర్లు పంపించనున్నారు.


Part - II Online Application


నవంబరులో ఫిజికల్ టెస్టులు...
ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఫలితాల్లో అర్హత సాధించే అభ్యర్థులకు నవంబరులో ఫిజికల్ ఎఫిషియెన్సీ, మెజర్‌మెంట్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రాథమిక రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు పంపించే లేఖల్లోనే వాటిని నిర్వహించే వేదిక, పరీక్ష తేదీ వివరాలను నియామక మండలి వెల్లడించనుంది.


ఈవెంట్లు ఇలా..
ఫిజికల్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థులకు మొదట పరుగు పందెం నిర్వహిస్తారు. పురుషులు 1,600 మీటర్లు, మహిళా అభ్యర్థులు 800 మీటర్ల పరుగును పూర్తి చేయాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలో పరుగు పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో లాంగ్‌జంప్‌, షాట్‌పుట్ పోటీలు నిర్వహిస్తారు. వీటన్నింటిలోనూ అర్హత సాధిస్తేనే తుది రాతపరీక్షకు అర్హులుగా పరిగణిస్తారు. వీరికి మాత్రమే ఫైనల్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జారీ చేసి, పరీక్ష నిర్వహిస్తారు.


తెలంగాణలో ఖాళీగా ఉన్న ఎస్‌ఐ, కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియలో భాగంగా నిర్వహించిన ప్రాథమిక పరీక్ష ఫలితాలు అక్టోబరు 26న విడుదలైన సంగతి తెలిసిందే. ఎస్‌ఐ, కానిస్టేబుల్, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్స్, ప్రొహిబిషన్‌, ఎక్సైజ్ కానిస్టేబుల్స్‌ ప్రాథమిక పరీక్షల ఫలితాలను తెలంగాణ స్టేట్‌ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించింది. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను పోలీస్ నియామక మండలి విడుదల చేసింది. ఫలితాలతోపాటు కానిస్టేబుల్, ఎస్‌ఐ ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీని కూడా మండలి విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను ఫైనల్ కీని అందుబాటులో ఉంచింది. 


ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత శాతం ఇలా..
ఎస్‌ఐ, కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాల్లో మొత్తం 41.67 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు. ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలకు సంబంధించి ఎస్‌ఐ పోస్టులకు 2,25,668 మంది రాత పరీక్ష రాయగా, 1,05,603(46.80 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. సివిల్ కానిస్టేబుల్‌ పోస్టులకు 5,88,891 మంది రాత పరీక్ష రాయగా, 1,84,861(31.39 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్ పోస్టులకు 41,835 మంది రాత పరీక్ష రాయగా, 18,758(44.84 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు 2,50,890 మంది రాత పరీక్ష రాయగా, 1,09,518(43.65 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.
ఎస్ఐ, కానిస్టేబుల్ ఫలితాలు, ప్రిలిమినరీ పరీక్ష ఫైనల్ ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..


రాష్ట్రవ్యాప్తంగా 554 ఎస్‌ఐ పోస్టులకు  ఆగస్టు 7న, అలాగే 16,321 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆగస్టు 28న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎస్‌ఐ రాతపరీక్షకు 2,47,217 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,25,759 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక కానిస్టేబుల్ పరీక్షకు మొత్తం 6,61,196 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 6,03,955 మంది అభ్యర్థులు హాజరయ్యారు.



: ALSO READ :


NHB Recruitment: నేషనల్ హౌసింగ్ బ్యాంకులో ఉద్యోగాలు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా!
న్యూఢిల్లీలోని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్, రెగ్యులర్ విధానంలో ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఎన్‌హెచ్‌బీలో ఉద్యోగాల భర్తీకి అక్టోబరు 29 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. నవంబరు 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
పోస్టులు, నోటిఫికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇండియన్ నేవీలో ఆఫీసర్ పోస్టులు, ప్రారంభ జీతం రూ.56,100
భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహిత పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అకడమిక్ మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ఎంపికైనవారికి కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో జూన్ 2023 ప్రారంభమయ్యే 23వ కోర్సులో సంబంధిత శాఖలు/ కేడర్/ స్పెషలైజేషన్లలో శిక్షణ ఇస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి..