➥ ఏప్రిల్ 30న ఎంపికైనవారి జాబితా వెల్లడి


➥ మే 5న నియామక ఉత్తర్వులు


రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైనవారికి మే 5వ తేదీన నియామక ఉత్తర్వులను అందజేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ పోస్టుల నియామకానికి డిసెంబరులో ప్రక్రియ ప్రారంభం కాగా మార్చి 28న మెరిట్ జాబితాను ప్రచురించారు. మార్చి 29 నుంచి ఏప్రిల్ 13 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. సుమారు వెయ్యికిపైగా అభ్యంతరాలు రావడంతో వాటిని పరిశీలించి తుది జాబితాను వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) సిద్ధం చేసింది.


ఏప్రిల్ 30న ఎంపికైన వారి జాబితాను వెల్లడించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈమేరకు బోధనాసుపత్రుల్లోని మొత్తం 34 విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించనున్నారు. అత్యధికంగా గైనకాలజీ, అనస్థీషియా, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ విభాగాల్లో పోస్టులు భర్తీ కానున్నాయి. తొలుత 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రకటన ఇవ్వగా ఖాళీల ఆధారంగా మరో 295 పోస్టులను భర్తీ చేయడానికి నిర్ణయించారు.


తాజా నియామక ప్రక్రియ పూర్తయితే బోధనాసుపత్రుల్లో చాలామేర వైద్యుల కొరత తీరుతుందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, కొత్తగా ఈ ఏడాది నుంచి ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం కానున్న మరో 9 వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న బోధనాసుపత్రుల్లో ఈ పోస్టులు కీలకంగా కానున్నాయి. కొత్తగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం నేపథ్యంలో ఇప్పటికే ఆ పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్నవారిలో సీనియారిటీ ఆధారంగా 210 మందికి అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించనున్నారు. ఇటీవల బోధనాసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్లలో 67 మందికి ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించారు. కొత్త వైద్య కళాశాలల్లో తరగతుల ప్రారంభానికి ముందే బోధన సిబ్బంది నియామక ప్రక్రియను కొలిక్కి తేవాల్సి ఉంటుంది. ఈమేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖాధికారులు పేర్కొంటున్నారు.


విభాగాల వారీగా నియామకాలు ఇలా..


➦ గైనకాలజీ - 187 


➦ అనస్థీషియా - 177


➦ జనరల్ సర్జరీ - 149


➦ జనరల్ మెడిసిన్ - 144


➦ పీడియాట్రిక్స్ - 94


➦ ఆర్థోపెడిక్స్ - 72


➦ రేడియో డయాగ్నసిస్ - 56


➦ పాథాలజీ - 48


➦ కమ్యూనిటీ మెడిసిన్ - 40


➦ అనాటమీ - 37


➦ సైకాలజీ - 37


➦ మైక్రోబయాలజీ - 36


➦ ఫోరెన్సిక్ - 31


➦ ఇతర 21 విభాగాలు - 334


Also Read:


తెలంగాణ జ్యుడీషియల్‌ సర్వీసులో డిస్ట్రిక్ట్‌ జడ్జి(ఎంట్రీ లెవెల్‌) పోస్టులు- అర్హతలివే!
హైదరాబాద్‌లోని తెలంగాణ హైకోర్టు తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ సర్వీసులో ఖాళీగా ఉన్న డిస్ట్రిక్ట్ జడ్జి(ఎంట్రీ లెవెల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 11 పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలంగాణ స్టేట్ హైకోర్టు లేదా దాని పరిధిలోని న్యాయస్థానాల్లో అడ్వకేట్‌గా కనీసం ఏడేళ్ల పని అనుభవంతో పాటు ఇతర విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు తమ దరఖాస్తులను మే 01 సా.5గంటలలోపు సంబంధిత చిరునామాకి పంపాలి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్‌లో 4,374 ఉద్యోగాలు, అర్హతలివే!
ముంబయిలోని భారత అణు శక్తి విభాగం ఆధ్వర్యంలోని 'భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్‌' వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించింది. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్‌ 24 నుంచి మే 22 లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులను ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..