తెలంగాణలో మరో ఉద్యోగ ప్రకటన త్వరలోనే వెలువడనుంది. వైద్యారోగ్య శాఖలో రాష్ట్ర ప్రభుత్వం భారీగా పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 3,897 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతులు జారీచేసింది. వచ్చే ఏడాది రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 9 ప్రభుత్వ వైద్య కళాశాలలు, వాటి అనుబంధ ఆస్పత్రుల్లో వివిధ కేటగిరీల్లో ఈ కొత్త పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఒక్కో కళాశాలకు 433 చొప్పున మొత్తంగా 3,897 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, జనగాం, నిర్మల్‌లోని వైద్య కళాశాలు, వాటి అనుబంధ ఆస్పత్రులకు పోస్టులు మంజూరయ్యాయి. వివిధ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సహా ఇతర పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చారు.

వైద్య కళాశాలలకు కొత్తగా పోస్టులు మంజూరు చేయడంపట్ల ఆర్థిక, వైద్య-ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు హర్షం వ్యక్తం చేశారు.  సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆరోగ్య తెలంగాణ దిశగా మరో ముందడుగు పడిందని ఈ సందర్భంగా హరీశ్‌రావు ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఆరోగ్య తెలంగాణ దిశగా మరో ముందడుగు పడిందని అన్నారు.  అందరికీ సరైన వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.







Also Read: 


గ్రూప్-4' నోటిఫికేషన్ వచ్చేసింది - 9168 ఉద్యోగాల భర్తీ షురూ!
రాష్ట్రంలో 9168 గ్రూప్-4 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చేఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఇటీవలే ఈ పోస్టులకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-4 పోస్టుల భర్తీకి డిసెంబరు 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణలో గెజిటెడ్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!
తెలంగాణలోని ప్రభుత్వ భూగర్భజల విభాగంలో గెజిటెడ్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 32 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థుల వయసు 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 6 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబరు 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. 2023 మార్చి లేదా ఏప్రిల్ నెలలో పరీక్ష నిర్వహిస్తారు.  
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణలో నాన్-గెజిటెడ్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణలోని ప్రభుత్వ భూగర్భజల విభాగంలో నాన్-గెజిటెడ్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 25 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థుల వయసు 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 7 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబరు 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. 2023 మార్చి లేదా ఏప్రిల్ నెలలో పరీక్ష నిర్వహిస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...