తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్& సబార్డినేట్ సర్వీసులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 1,226 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏడో తరగతి నుంచి పదో తరగతి మధ్య ఏదైనా పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. పదో తరగతి కంటే ఎక్కువ విద్యార్హత కలిగిన అభ్యర్థులు అనర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో  జనవరి 11 నుంచి 31వ తేదీ లోగా దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.


వివరాలు..


★ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 


మొత్తం ఖాళీలు: 1226


జిల్లాల వారీగా ఖాళీలు..


1. ఆదిలాబాద్:10


2. భద్రాద్రి కొత్తగూడెం: 19


3. కోర్ట్ ఆఫ్‌ ద ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఫర్ సీబీఐ కేసెస్, హైదరాబాద్: 36


4. సిటీ సివిల్ కోర్టు, హైదరాబాద్125


5. సిటీ స్మాల్ కాజెస్ కోర్టు, హైదరాబాద్: 26


6. హనుమకొండ: 19


7. జగిత్యాల: 32


8. జనగామ: 13


9. జయశంకర్ భూపాలపల్లి:18


10. జోగులాంబ గద్వాల:25


11. కామారెడ్డి: 14


12. కరీంనగర్:12


13. ఖమ్మం: 13


14. కుమ్రం భీం ఆసిఫాబాద్: 11


15. మహబూబాబాద్:  13


16. 17. మంచిర్యాల: 14


18. మహబూబ్ నగర్: 33


19. మెదక్: 16


20. మేడ్చల్మల్కాజిగిరి: 92


21. మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, హైదరాబాద్: 128


22. ములుగు: 14


23. నాగర్ కర్నూలు:28


24. నల్గొండ: 55


25. నారాయణపేట: 11


26. నిర్మల్:18


27. నిజామాబాద్:20


28. పెద్దపల్లి:41


29. రాజన్న సిరిసిల్ల:26


30. రంగారెడ్డి:150


31. సంగారెడ్డి:30


32. సిద్దిపేట: 25


33. సూర్యాపేట:38


34. వికారాబాద్: 27


35. వనపర్తి:19


36. వరంగల్:21


37. యాదాద్రి భువనగిరి:34


అర్హత: ఏడో తరగతి నుంచి పదో తరగతి మధ్య ఏదైనా పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. పదో తరగతి కంటే ఎక్కువ విద్యార్హత కలిగిన అభ్యర్థులు అనర్హులు. అభ్యర్థులు దరఖాస్తులో వృత్తిపరమైన నైపుణ్యాలను పేర్కొనాలి, అంతేకాకుండా స్థానిక భాషలు తెలిసి ఉండాలి.


వయోపరిమితి:  01.07.2022 నాటికి 1834 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది.


దరఖాస్తు ఫీజు: ఓసీ/ ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.400.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాలి.


ఎంపిక ప్రక్రియ: సీబీటీ/ ఓఎమ్మార్ పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.


పరీక్ష విధానం: మొత్తం 45 మార్కులకు  కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)/ ఓమ్మార్ రాత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 45 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. వీటిలో జనరల్ నాలెడ్జ్- 30 ప్రశ్నలు-30 మార్కులు, జనరల్ ఇంగ్లిష్- 15 ప్రశ్నలు-15 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు.


జీత భత్యాలు:  నెలకు రూ.19,000రూ.58,850 చెల్లిస్తారు.


ముఖ్యమైన తేదీలు..


🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 11.01.2023.


🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.01.2023.


🔰 హాల్ టిక్కెట్ డౌన్‌లోడ్ ప్రారంభ తేదీ: 15.02.2023.


🔰 కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: మార్చి 2023


Notification 


Website 


Also Read: 


సీఆర్‌పీఎఫ్‌లో 1458 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్, ఈ అర్హతలుండాలి!
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1458 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో 143 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI - స్టెనోగ్రాఫర్) పోస్టులు, 1315 హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టులు ఉన్నాయి. ఇంటర్ అర్హత ఉన్న యువతీయువకులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల భ ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 4న ప్రారంభమై 25న ముగియనుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


వరంగల్‌ 'నిట్'లో 100 టీచింగ్ ఫ్యాకల్టీలు, పోస్టుల వివరాలు ఇలా! అర్హతలివే!
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 100 టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో తమ దఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 27న ప్రారంభంకాగా.. జనవరి 25 వరకు కొనసాగనుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...