తెలంగాణలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఇప్పట్లో ముగిసేలా కనిపించడంలేదు. ఈ కేసుపై ఆగస్టు 7న విచారణ జరిగింది. అయితే ఈసారి అయినా కేసు కొలిక్కి వస్తుందని టచర్లంతా భావించారు. కోర్టు 'స్టే' పొడిగిస్తూ మరో వారం రోజులపాటు కేసును హైకోర్టు వాయిదా వేయడంతో టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే పలుమార్లు ఈ కేసు వాయిదా పడుతూ వస్తోంది. ఈలోపు ఎన్నికల కోడ్‌ వస్తే ఎలా? అని టీచర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జీవో నెం.5కు విడుదల చేసి టీచర్ల బదిలీలు, పదోన్నతులకు ప్రక్రియను గతంలోనే మొదలు పెట్టిన విషయం తెలిసిందే.


అయితే ఆ జీవోకు చట్టబద్ధత లేదని, స్పౌజ్‌ పాయింట్లపై, టీచర్‌ సంఘాల ప్రతినిధులకు ఇచ్చిన స్పెషల్‌ పాయింట్లు తదితర అంశాలపైన కొంత మంది ఉపాధ్యాయులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్‌లు దాఖలు చేశారు. వీటిపై హైకోర్టు గత నాలుగైదు నెలలుగా విచారణ జరుపుతూనే ఉంది. కాగా, అసెంబ్లీ ఆమోదం పొందని, చట్టబద్ధతలేని జీవో నెం.5 ద్వారా ఏవిధంగా ప్రమోషన్లు, బదిలీలు చేపడతారని పిటిషనర్లు వాదిస్తూ వచ్చారు. 


ఆ జీవోకు చట్టబద్ధత కల్పించాలని భావించిన ప్రభుత్వం ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జీవో నెం.5కు చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించింది. చట్టబద్ధత లభించడంతో ఇక బదిలీల ప్రక్రియ యథాతధంగా కొనసాగుతోందని అటు ప్రభుత్వం, ఇటు ఉపాధ్యాయులు భావించారు. కానీ ఆగస్టు 7న కోర్టులో కేసు విచారణ ఉండటంతో బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించిన స్టే వెకేట్‌ అయి మార్గం సుగమం అవుతుందని ఆశించారు. ఇందులో భాగంగా కోర్టుకు జీవో నెం.5 చట్టబద్ధత దస్త్రాన్ని అధికారులు కోర్టుకి సమర్పించారు. అయితే ఆ ఫైల్‌ స్టడీ కోసం పిటిషనర్‌ తరుపు న్యాయవాది వారం రోజుల సమయాన్ని అడిగారు. దీంతో కోర్టు ఒక వారం రోజులు కేసును వాయిదా వేసింది.


ఫిబ్రవరి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతోంది. అటు ప్రభుత్వం కూడా వీలైనంత త్వరగా బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టి ముగించేయాలని భావిస్తోంది. ఈక్రమంలోనే ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడి మేరకు జీవో నెం.5కు చట్టబద్ధతను కల్పిస్తూ అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నారు. వచ్చే వారమైన ఈ కేసు కొలిక్కి వచ్చి బదిలీలకు లైన్‌క్లియర్‌ అవుతుందో లేదోనని ఉపాధ్యాయులు ఆశగా వేచిచూస్తున్న పరిస్థితి నెలకొంది. బదిలీల కోసం సుమారు 73వేల మంది ఉపాధ్యాయులు, పదోన్నతుల కోసం సుమారు 10 వేల మంది టీచర్లు ఎదురుచూస్తున్నారు.


ఈ కేసు విచారణ తిరిగి ఆగస్టు 14న విచారణకు రానుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొన్నారు. మరో వారం రోజుల వరకు ఇదే సస్పెన్స్‌ కొనసాగనుంది. అసెంబ్లీలో జీవో నెం.5కు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బదిలీల ప్రక్రియ ఒకట్రెండు రోజుల్లో పున:ప్రారంభమవుతుందని భావించారు. దీంతో ముందే ఉపాధ్యాయులు సంబరాలు కూడా చేసుకున్నారు.తీరా కేసు విచారణ జరిగి మళ్లి వాయిదా పడడంతో ఉపాధ్యాయులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. 


ALSO READ:


షెడ్యూలు ప్రకారమే 'గ్రూప్‌-2' పరీక్ష నిర్వహణ, స్పష్టం చేసిన సీఎం కేసీఆర్
తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్ష వాయిదా గురించి వస్తున్న పుకార్లకు ప్రభుత్వం ఫుల్‌స్టాప్ పెట్టింది. షెడ్యూల్‌ ప్రకారమే గ్రూప్-2 పరీక్ష జరుగుతుందని ఆదివారం (జులై 6) అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన  ప్రకటనతో స్పష్టత వచ్చినట్లయింది. గ్రూప్‌-2 పరీక్ష వాయిదా వేయాలని ఇటీవల కొంతమంది టీఎస్‌పీఎస్సీని ఆశ్రయించారు. షెడ్యూల్‌ ప్రకారమే పరీక్ష నిర్వహించాలని మరికొందరు కమిషన్‌ను కోరారు. అక్టోబర్‌లో దసరా సెలవులు ఉండటం, ఆ తర్వాత నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో షెడ్యూల్‌ ప్రకారమే 'గ్రూప్‌-2' పరీక్ష నిర్వహించాలని అభ్యర్థిస్తున్నారు. దీంతో టీఎస్‌పీఎస్సీ సైతం ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించాలని భావిస్తోంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో 650 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలు అవసరం
ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్(ఏఎఫ్‌ఎంఎస్‌) షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి సంక్షిప్త ఉద్యోగ ప్రకటన (షార్ట్ నోటిఫికేషన్)ను విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 650 మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో పురుషులకు 585 పోస్టులు, మహిళలకు 65 పోస్టులు కేటాయించారు. ఎంబీబీఎస్‌, పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్వ్యూ, ఫిజికల్, మెడికల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి. నోటిఫికేషన్‌ వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఆగస్టు 12 నుంచి సెప్టెంబరు 10 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..