తెలంగాణలోని గురుకులాల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్ష తేదీలను గురుకుల విద్యాలయాల సంస్థ ఖరారు చేసింది. ఆగస్టు 1 నుంచి 23 వరకు గురుకుల నియామక పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షల పూర్తి షెడ్యూలును ఒకట్రెండుల్లో వెల్లడించనున్నట్టు తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థ నియామక బోర్డు కన్వీనర్ డా. మల్లయ్య బట్టు ఒక ప్రకటనలో తెలిపారు తెలిపారు. తెలంగాణలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ గురుకులాల్లో మొత్తం 9210 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. మొత్తం 9 నోటిఫికేషన్లను గురుకుల నియామక బోర్డు విడుదల చేసింది. ఈ పోస్టులకు మొత్తం 2.63 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఆన్‌లైన్ విధానంలోనే పరీక్షలు..
గురుకుల పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షలను ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అయితే సబ్జెక్టుల వారీగా దరఖాస్తులు 35 వేల లోపు ఉంటేనే సీబీటీ విధానంలో నిర్వహించాలని భావించింది. అయితే ఉద్యోగ నియామక ప్రకటనల్లో ఓఎంఆర్ లేదా సీబీఆర్‌టీ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని, ఈ విషయంలో గురుకుల బోర్డుదే తుదినిర్ణయమని స్పష్టం చేసింది. రాష్ట్రంలో టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ అనంతరం పరీక్ష విధానాల్లో మార్పులు చేయాలని ఇప్పటికే కమిషన్ నిర్ణయించింది. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నపుడు అవసరమైతే షిఫ్టుల విధానంలో సీబీఆర్‌టీ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. కమిషన్ తరహాలో సీబీఆర్‌టీ విధానంలో పరీక్షలు నిర్వహిస్తే ఫలితాలు వెంటనే ఇచ్చేందుకు వీలవుతుందని గురుకుల నియామక బోర్డు వర్గాలు భావిస్తున్నాయి. గురుకుల పోస్టుల భర్తీ సబ్జెక్టుల వారీగా ఉంటుంది. సబ్జెక్టుల వారీగా వచ్చే దరఖాస్తుల సంఖ్య 35 వేల వరకు ఉంటే సీబీఆర్‌టీ విధానంలో పరీక్షలు నిర్వహించేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని భావిస్తోంది. అయితే తుదకు పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే పరీక్షలు నిర్వహించేందుకు నియామక బోర్డు నిర్ణయించింది.
పోస్టుల వివరాలు..
క్ర.సం. |
పోస్టు పేరు |
పోస్టుల సంఖ్య |
1. |
డిగ్రీ లెక్చరర్ పీడీ, లైబ్రేరియన్ |
868 |
2. |
జూనియర్ లెక్చరర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ |
2008 |
3. |
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) |
1276 |
4. |
ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ) |
4020 |
5. |
లైబ్రేరియన్ స్కూల్ |
434 |
6. |
ఫిజికల్ డైరెక్టర్స్ ఇన్ స్కూల్ |
275 |
7. |
డ్రాయింగ్ టీచర్స్ ఆర్ట్ టీచర్స్ |
134 |
8. |
క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్ క్రాఫ్ట్ టీచర్స్ |
92 |
9. |
మ్యూజిక్ టీచర్స్ |
124 |
|
మొత్తం ఖాళీలు |
9210 |
Also Read:
గురుకుల పోస్టుల దరఖాస్తుల సవరణ, ఈ తేదీల్లోనే అవకాశం!
తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల విద్యాలయాల సొసైటీ పరిధిలో 9,231 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అర్హత గల అభ్యర్థుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించారు. అయితే అభ్యర్థులకు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది గురుకుల నియామక బోర్డు. అభ్యర్థులు ఒకసారి మాత్రమే తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసిన దరఖాస్తులను ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాని సూచించారు.
దరఖాస్తుల సవరణ పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 35 జూనియర్ ఇంజినీర్ పోస్టులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వివిధ విభాగాల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 35 పోస్టులను భర్తీ చేయనున్నారు. కనీసం 65 శాతం మార్కులతో డిప్లొమా, డిగ్రీ (సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జూన్ 30 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..