తెలంగాణ స్టేట్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(TSGENCO)లో ఏఈ (Assistant Engineer), కెమిస్ట్‌ (Chemist) ఉద్యోగాల నియామక రాతపరీక్ష వాయిదాపడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. డిసెంబర్‌ 17న నిర్వహించాల్సిన నియామక పరీక్షలను, ఇతర పరీక్షలు ఉన్నందున జెన్‌కో పోస్టుల పరీక్షలను వాయిదా వేసినట్లు తెలంగాణ జెన్‌ కో వెల్లడించింది. పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు సంస్థ తెలిపింది. జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ ఉద్యోగాల నియామక రాతపరీక్ష హాల్‌టికెట్లను విద్యుత్ సంస్థ ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. పరీక్ష తేదీ వాయిదాపడిన నేపథ్యంలో.. తాజా హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లోని కేంద్రాల్లో ఓఎంఆర్‌ షీట్‌/ ఆఫ్‌లైన్‌ పద్ధతిలో నియామక పరీక్ష నిర్వహించనున్నారు. 


తెలంగాణ జెన్‌కోలో 339 అసిస్టెంట్ ఇంజినీర్, 60 కెమిస్ట్‌ పోస్టుల భర్తీకి అక్టోబరు 5న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి అక్టోబరు 7 నుంచి నవంబరు 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. నవంబరు 14, 15 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. డిసెంబర్‌ 17న పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్వహణతో పాటు ఇప్పటికే ఉన్న పాత విద్యుత్ కేంద్రాల అవసరాల కోసం ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.65,600 - రూ.1,31,220 వరకు జీతంగా ఇస్తారు.


పరీక్ష విధానం..
మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు సెక్షన్ల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. 'సెక్షన్-ఎ'లో అభ్యర్థుల సబ్జెక్టు (కోర్ టెక్నికల్) నుంచి 80 ప్రశ్నలు-80 మార్కులు, 'సెక్షన్-బి'లో ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్, అనలిటికల్ & న్యూమరికల్ ఎబిలిటీ, తెలంగాణ హిస్టరీ, కల్చర్, తెలంగాణ ఆవిర్భావం, అభివృద్ధి, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 20 ప్రశ్నలు-20 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు (120 నిమిషాలు). 


➥ ఏఈ పోస్టుల వివరాలు..


ఖాళీల సంఖ్య: 339 (లిమిటెడ్-94, జనరల్-245)


విభాగాలవారీగా ఖాళీలు: ఎలక్ట్రికల్-187, మెకానికల్-77, ఎలక్ట్రానిక్స్-25, సివిల్-50.  


అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 01.07.2023 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.


నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి.. 


➥ కెమిస్ట్ పోస్టుల వివరాలు


ఖాళీల సంఖ్య: 60 (లిమిటెడ్-03, జనరల్-57)


అర్హత: ప్రథమ శ్రేణిలో ఎంఎస్సీ (కెమిస్ట్రీ/ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్) ఉత్తీర్ణత ఉండాలి.


వయోపరిమితి: 01.07.2023 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.


నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి.. 


ALSO READ:


➥ ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు


➥ ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా


➥ ఎస్‌బీఐ క్లర్క్ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?


➥ ఐడీబీఐ బ్యాంకులో 86 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు, వివరాలు ఇలా


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...