TS DSC 2023 Application Date extended: తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీకి నిర్దేశించిన డీఎస్సీ(టీఆర్‌టీ)-2023 ఆన్‌లైన్ దరఖాస్తు గడువును పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అక్టోబరు 21న ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థుల డిమాండ్ మేరకు అక్టోబర్ 28 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. నవంబరు 20 నుంచి 30 వరకు నిర్వహించాల్సి డీఎస్సీ పరీక్షలను ఎన్నికల కారణంగా ప్రభుత్వం వాయిదావేసిన సంగతి తెలిసిందే. పరీక్షలు వాయిదాపడటంతో.. దరఖాస్తు గడువును కూడా అధికారులు తాజాగా పొడిగించారు.
అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కారణంగా నవంబరు 20 నుంచి 30 వరకు నిర్వహించాల్సిన డీఎస్సీ పరీక్షలను విద్యాశాఖ వాయిదావేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని 44 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది. ఇక దివ్యాంగులకు మాత్రం 10 సంవత్సరాలపాటు వయోసడలింపు ఉంటుంది.
1.33 లక్షల మంది దరఖాస్తు..
డీఎస్సీ-2023కు సంబంధించి ఇప్పటి వరకు 1.38 లక్షల మంది ఫీజు చెల్లించగా, వారిలో 1.33 లక్షల మంది దరఖాస్తులు సమర్పించారు. దరఖాస్తు గడువును పెంచడంతో గత రెండు రోజుల నుంచి సర్వర్ సమస్యలతో ఫీజు చెల్లించలేకపోయిన అభ్యర్థులకు ఊరట లభించినట్లయింది. ఫీజు చెల్లించడానికి అక్టోబరు 20 చివరిరోజు కావడంతో దరఖాస్తు చేసుకోలేపోయిన అభ్యర్థులు కంగారు పడ్డారు. దీంతో దరఖాస్తు గడువును మరో 8 రోజులు పెంచుతూ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
అర్హతలు, వయోపరిమితి వివరాలు..
తెలంగాణలోని ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సెప్టెంబరు 7న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిద్వారా మొత్తం 5089 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో ఎస్‌జీటీ - 2,575 పోస్టులు; స్కూల్ అసిస్టెంట్ -1,739 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్ - 611 పోస్టులు, పీఈటీ - 164 పోస్టులు ఉన్నాయి. డీఎస్సీ ద్వారానే ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల్లో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 358, నిజామాబాద్ జిల్లాలో 309 ఖాళీలున్నాయి. పెద్దపల్లి జిల్లాలో అతి తక్కువగా 43, హన్మకొండలో 53 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. పాత ఉమ్మడి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
పరీక్ష స్వరూపం ఇలా..
పరీక్షల తేదీలతోపాటు, పరీక్ష స్వరూపాన్ని కూడా విద్యాశాఖ వెల్లడించింది. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, పీఈటీ పరీక్షలకు సంబంధించిన డిటైయిల్డ్ ఎగ్జామ్ ప్యాటర్న్‌ను విడుదల చేసింది. ఏయే సబ్జెక్టుల నుంచి ఎన్ని మార్కులు ఉంటాయనే వివరాలను తెలిపింది.
➥ ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 80 మార్కులు, 160 ప్రశ్నలకు గానూ పరీక్ష నిర్వహిస్తారు. మిగతా 20 మార్కులు టెట్‌లో వచ్చిన స్కోర్‌ను వెయిటేజీగా పరిగణిస్తారు.
➥ పీఈటీ, పీఈడీ అభ్యర్థులకు మాత్రం 100 మార్కులు, 200 ప్రశ్నలతో ప్రశ్నపత్రం ఉండనుంది.
ALSO READ:
ఇండియన్ ఆర్మీలో 'టెక్నికల్ ఎంట్రీ స్కీమ్' దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
ఇండియన్ ఆర్మీలో జులై-2024లో ప్రారంభమయ్యే 51వ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్(టీఈఎస్) కోర్సు శిక్షణలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 90 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డు నుంచి కనీసం 60 శాతం మార్కులతో 10+2(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) లేదా దానికి సమానమైన పరీక్షతో పాటు జేఈఈ(మెయిన్స్)-2023లో ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇంటెలిజెన్స్ బ్యూరోలో 677 ఉద్యోగాల దరఖాస్తులు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
కేంద్ర హోంవ్యవహారాల మంత్రిత్వ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో 677 సెక్యూరిటీ అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్‌పోర్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 14న ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన వారు నవంబరు 13 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
పోస్టులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..