TS Gurukul JL, DL Results: తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో 1,924 జూనియర్ లెక్చరర్, 785 డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను గురుకుల నియామక బోర్డు వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణపత్రాల పరిశీలన, డెమో తరగతులకు ఎంపిక చేసింది. జేఎల్ అభ్యర్థులకు ఫిబ్రవరి 19 నుంచి 22 వరకు, డీఎల్ అభ్యర్థులకు ఫిబ్రవరి 19 నుంచి 20 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ఆ తర్వాత వారికి డెమో తరగతులు నిర్వహించనుంది. ఫలితాల గురించి అభ్యర్థులకు వ్యక్తిగతంగా ఫోన్ ద్వారా సమాచారం అందిస్తున్నారు. ఎవరైనా ఫోన్లో అందుబాటులోకి రాకపోతే వారి ఇళ్లకు సంక్షేమ గురుకుల సొసైటీల సిబ్బందిని పంపించి సమాచారం ఇస్తోంది.  


తాజాగా డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ ఫలితాలు వెల్లడించడంతో.. ఇక గురుకులాల్లో 4,006 టీజీటీ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు ప్రకటించేందుకు బోర్డు కసరత్తు చేస్తోంది. ఈ పోస్టులకు టెట్/సెంట్రల్ సెట్ అర్హత తప్పనిసరి కావడంతో ఇప్పటికే ఆ వివరాలు సేకరించింది. వచ్చే వారంలో ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసి నియామక జాబితా విడుదల చేయనుంది. దీంతో గురుకులాల నియామక సంస్థ గతేడాది ప్రారంభించిన 9,210 పోస్టుల నియామక ప్రక్రియ పూర్తికానుంది.


 List of documents for Certificate Verification


Click here for Attestation Form


Click here for Checklist


Junior College Lecturers list for Certificate Verification & Demonstration @ 1:2 ratio.


Degree College Lecturers in Computer Science list for Certificate Verification & Demonstration @ 1:2 ratio


Degree College Lecturers list for Certificate Verification & Demonstration @ 1:2 ratio.


ALSO READ:


టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ పరీక్షల ఫలితాలు విడుదల - వెబ్‌సైట్‌లో మెరిట్ జాబితాలు
తెలంగాణలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో 547 పోస్టుల భర్తీకి ఆరు ఉద్యోగ ప్రకటనల కింద నిర్వహించిన పరీక్షల ఫలితాలు విడులయ్యాయి. ఈ మేరకు జనరల్ ర్యాంకు మెరిట్ జాబితాల (జీఆర్‌ఎల్)ను టీఎస్‌పీఎస్సీ(TSPSC) శుక్రవారం (ఫిబ్రవరి 16న) రాత్రి విడుదల చేసింది. వీటిలో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్, హార్టికల్చర్ అధికారి, లైబ్రేరియన్లు, ఏఎంవీఐ, అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి 2022లో నోటిఫికేషన్లు ఇవ్వగా, 2023 మే, జూన్, జులై నెలల్లో కంప్యూటర్ ఆధారిత రాతపరీక్షలు నిర్వహించారు. తాజాగా ఈ పరీక్షల జనరల్ ర్యాంకు జాబితాలను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో జాబితాలు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..


సివిల్ సర్వీసెస్ మెయిన్స్ మూడో విడత ఇంటర్వ్యూ షెడ్యూలు విడుదల
యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఆధ్వర్యంలో నిర్వహించిన సివిల్ సర్వీసెస్-2023 పరీక్షకు సంబంధించి మూడవ విడత ఇంటర్వ్యూ షెడ్యూలును యూపీఎస్సీ ఫిబ్రవరి 16న వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులకు మార్చి 18 నుంచి ఏప్రిల్ 9 వరకు ముఖాముఖి పరీక్షలు నిర్వహించనున్నారు. మూడోవిడతలో మొత్తం 817 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. 
పూర్తిషెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...