తెలుగు రాష్ట్రాల్లో 69,265 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం పార్లమెంటులో ప్రకటించింది. 2021-22లో ఏపీలో 50,677, తెలంగాణలో 18,588 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. డిసెంబర్ 14న రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ సంజయ్ సింగ్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. 


ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో 50,677 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో 18,588 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల సంఖ్య గత మూడేళ్లలో 30,001 నుంచి 30,023కి చేరుకుందని వెల్లడించారు. అదే సమయంలో వాటిలో చేరిన విద్యార్థుల సంఖ్య 28,37,635 నుంచి 33,03,699 (16.42%)కి పెరిగిందని వెల్లడించారు. ప్రైవేటు స్కూళ్లలో చేరినవారి సంఖ్య 39,84,609 నుంచి 35,14,338కి (11.80%) తగ్గిందని పేర్కొన్నారు. 


దేశంలో ఉన్నత విద్యా సంస్థల్లో 3,753 బ్యాక్‌లాగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వైసీపీ ఎంపీ ఆర్‌ కృష్ణయ్య అడిగిన మరో ప్రశుకు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుభాష్‌ సర్కార్‌ సమాధానం ఇచ్చారు.


అయిదేళ్లలో 2.12 లక్షలు తగ్గిన ఇంజినీరింగ్ సీట్లు
దేశంలో గత అయిదేళ్లలో 2,12,536 ఇంజినీరింగ్ సీట్లు తగ్గిపోయాయి. 2017-18 విద్యాసంవత్సరంలో ఏఐసీటీఈ 14,65,873 సీట్లకు అనుమతి ఇవ్వగా.. 2021-22 నాటికి ఇవి 12,53,337కి తగ్గాయి. 2017-18లో మొత్తం సీట్లలో 7,22,112(49.26%) ఖాళీగా మిగిలిపోగా, 2021-22లో 4,21,203(33.60%) సీట్లు భర్తీ కాలేదు. డిసెంబర్ 14న రాజ్యసభలో తెరాస నేత కె.కేశవరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్ సర్కార్ ఈమేరకు సమాధానమిచ్చారు.


 


Also Read:


గుడ్ న్యూస్ - ఆర్ఆర్‌బీ 'గ్రూప్-డి' ఫలితాలు వచ్చేస్తున్నాయి, ఎప్పుడంటే?
ఇండియన్ రైల్వేలో గ్రూప్-డి పోస్టుల భర్తీకి నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష (సీబీటీ) ఫలితాలు త్వరలోనే వెలువనున్నాయి. ఈ మేరకు రైల్వేశాఖ డిసెంబరు 13న ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిప్రకారం డిసెంబరు 24 లేదా అంతకన్నా ముందుగానే ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఫలితాలతోపాటు ఫైనల్ కీ, కటాఫ్ మార్కుల వివరాలను కూడా రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్ విడుదల చేయనుంది. 
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..


ఏపీలో 6100 కానిస్టేబుల్ పోస్టులు, పూర్తి వివరాలు ఇలా!
ఏపీలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పోలీసు నియామక మండలి (APSLPRB) నవంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా రాష్ట్రంలోని పోలీసు స్టేషన్ల పరిధిలో 6100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే పదోతరగతి పాసై, ఇంటర్ చదువుతూ ఉండాలి. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నవంబరు 30న మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 28న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...