AP DSC Hall Tickets: ఆంధ్రప్రదేశ్‌లో జూన్ ఆరో తేదీ నుంచి డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన హాల్‌టికెట్లు ఈ ఉదయం నుంచి అందుబాటులోకి తీసుకచ్చింది విద్యాశాఖ. అయితే ఇలా హాల్‌టికెట్లు మధ్యాహ్నం వరకు డౌన్‌లోడ్ కాలేదు. దీంతో అభ్యర్థులు కంగారు పడ్డారు. ఉదయం పదిగంటల తర్వాత సర్వర్ పని చేయడం ప్రారంభమైంది. అప్పటి నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లౌడ్ అవుతున్నాయి.
ఇక్కడే మరికొందరు అభ్యర్థులకు టెన్షన్ మొదలైంది. వివిధ సాంకేతిక కారణాలతో చాలా మంది అభ్యర్థులకు హాల్‌టికెట్లు డౌన్ లోడ్ కాలేదు. మీరు ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో ఎంపిక చేసుకోలేదనే మెసేజ్ చూపించింది. కానీ అప్లికేషన్‌లో పోస్టులకు అప్లై చేసుకున్నట్టు ఉంది. దీని చూసిన అభ్యర్థుల్లో కంగారు మొదలైంది. ఏం చేయాలో తెలియక ఆందోళన వ్యక్తం చేశారు.
వెంటనే డీఎస్సీ వెబ్‌సైట్‌లో ఇచ్చిన నెంబర్లకు వరుస పెట్టి ఫోన్లు చేయడం మొదలు పెట్టారు. కొన్ని నెంబర్లు నిత్యం బిజీ అని వస్తుంటే మరికొన్ని నెంబర్లు రింగ్ అవుతున్నా ఎవరూ ఎత్తలేదు. దీంతో అభ్యర్థులు మరింత టెన్షన్ పడ్డారు. తమ సమస్య ఏంటో అర్థం కాక ఉదయం నుంచి ఈ హైరానాలో ఉండిపోయారు. అసలే ఈ పది రోజులు చదవడం చాలా ముఖ్యం కానీ ఇంతలో ఇలాంటి సమస్య రావడంతో వారికి ఏం చేయాలో తోచలేదు.
మధ్యాహ్నం నుంచి ట్రై చేస్తూ ఉంటే చివరకు సంబంధిత సిబ్బంది ఫోన్‌లు ఎత్తి అసలు విషయం చెప్పారు. రాష్ట్రంలో చాలా మంది ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారని అన్నారు. ఎవరూ కంగారు పడొద్దని అన్నారు. టెక్నికల్ ఇష్యూ వల్ల ఇలా జరిగిందని సరి చేసినట్టు వెల్లడించారు. వారు అలా చెప్పిన తర్వాత నుంచి ఇలాంటి సమస్య ఎదుర్కొన్న వారి హాల్‌టికెట్లు డౌన్లోడ్ అవ్వడం ప్రారంభమయ్యాయి.
మిగతా అభ్యర్థులకి కూడా టెన్షన్ ఇలాంటివి చాలా మందికి జరిగాయి. రెండు అంత కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేసిన వారికి సరిగా హాల్ టికెట్లు రాలేదు. కొన్ని పరీక్షలు మాత్రమే వారికి చూపించాయి. అయితే అన్ని వైపుల నుంచి ఫోన్లు రావడంతో అధికారులు సమస్యలను సరి చేశారు. ఇప్పుడు అన్ని పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను వెబ్‌సైట్, వాట్సాప్ సర్వీస్‌లో పొందుపరిచారు.
వాట్సాప్‌లో హాల్‌టికెట్లు డీఎస్సీకి సంబంధించిన హాల్ టికెట్లను cse.ap.gov.inలోనే కాకుండా వాట్సాప్ ద్వారా కూడా డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. వెబ్‌సైట్‌లోకి వెళ్తే మీకు ఐడీ పాస్‌వర్డ్ అడుగుతుంది. వాట్సాప్‌లో అయితే మీరు మీ ఆధార్ నెంబర్ తెలిస్తే చాలా హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.