దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 4,062 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులకు దరఖాస్తుల గడువు జులై 31తో ముగిసింది. దీంతో ఆ గడువును ఆగస్టు 18 వరకు పొడిగిస్తూ కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) నిర్ణయం తీసుకుంది. ఈ పోస్టులకు భర్తీకి అర్హులైన వారు ఆగస్టు 18 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.


భారత ప్రభుత్వ గిరిజ‌న వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సోసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌(ఎన్‌ఈఎస్‌టీఎస్‌) దేశవ్యాప్తంగా ఉన్న ఏక‌ల‌వ్య మోడ‌ల్ రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌ల్లో (ఈఎంఆర్ఎస్‌) ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 4062 టీచింగ్, నాన్‌-టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆగస్టు 18లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. జాతీయస్థాయి రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.


పోస్టుల వివ‌రాలు...


* మొత్తం ఖాళీలు: 4062


పోస్టుల వారీగా ఖాళీలు..


1) ప్రిన్సిప‌ల్‌: 303 పోస్టులు 


అర్హత: బీఈడీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.


పని అనుభవం: కనీసం 12 ఏళ్లు పని అనుభవం ఉండాలి.


వయసు: 50 సంవత్సరాలకు మించకూడదు. 


జీతభత్యాలు: రూ.78,800-రూ.2,09,200.


2) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (పీజీటీ): 2266 పోస్టులు


అర్హత: బీఈడీ, పీజీ డిగ్రీ/ ఎంఎస్సీ/ ఎంఈ/ ఎంటెక్‌/ ఎంసీఏ ఉత్తీర్ణత.


వయసు: 40 సంవత్సరాలకు మించకూడదు.


జీతభత్యాలు: రూ.47,600-రూ.1,51,100.


3) అకౌంటెంట్‌: 361 పోస్టులు


అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.


వయసు: 30 సంవత్సరాలకు మించకూడదు.


జీతభత్యాలు: రూ.35,400-రూ.1,12,400.


4) జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (JNA): 759


అర్హత: సీనియర్ సెకండరీ ఉత్తీర్ణులై ఉండాలి.


వయసు: 30 సంవత్సరాలకు మించకూడదు.


జీతభత్యాలు: రూ.19900-రూ.63200


5) ల్యాబ్‌ అటెండెంట్‌: 373


అర్హత: పదోతరగతి లేదా ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.


వయసు: 30 సంవత్సరాలకు మించకూడదు.


జీతభత్యాలు: రూ.18,000-రూ.56,900.


విభాగాలు: ఇంగ్లిష్, హిందీ, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, హిస్టరీ, జియోగ్రఫీ, కామర్స్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్. 


వయోపరిమితి: నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీకు 5 సంవత్సరాలు; బీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10-15 సంవత్సరాలు; ఇతరులకు 5 సంవత్సరాలు, ఈఎంఆర్ఎస్‌లలో ఇదివరకే శాశ్వత ఉద్యోగాల్లో పనిచేస్తున్నవారికి 55 సంవత్సరాల వరకు వెసులుబాటుల ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ఈఎంఆర్‌ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ ఆధారంగా.


దరఖాస్తు ఫీజు: ప్రిన్సిపల్ పోస్టులకు రూ.2000, పీజీటీ పోస్టులకు రూ.1500, నాన్-టీచింగ్ పోస్టులకు రూ.1000 చెల్లించాలి.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.07.2023. (18.08.2023 వరకు పొడిగించారు)


Notification


Information Bulletin & Guidelines


Apply for the Post of Principal Posts


Apply for the Post of PGT Posts


Apply for the Post of Non-Teaching Staff 


Website


ALSO READ:


IBPS PO: 3049 పోస్టులతో ఐబీపీఎస్ పీవో నోటిఫికేషన్ వచ్చేసింది, దరఖాస్తు ప్రారంభం
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎంటీ) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ (సీఆర్‌పీ-పీవో XIII) విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 3049 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఐబీపీఎస్ పీవో పోస్టుల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 1న ప్రారంభంకాగా.. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175; ఇతరులు రూ.850 చెల్లించి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 21 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రెండు దశల రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


1402 పోస్టులతో ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ
దేశంలోని వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (సీఆర్‌పీ ఎస్‌పీఎల్-XIII) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ వెల్లడించింది. డిగ్రీ, పీజీ అర్హత, తగు అనుభవం ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రెండుదశల రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆగస్టు 1 నుంచి 21 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..