తెలంగాణలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును మరో వారం రోజులపాటు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 5తో దరఖాస్తు గడువు ముగియాల్సి ఉండగా.. జనవరి 12 వరకు పొడిగించారు. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్య సేవలు నియామక సంస్థ సభ్య కార్యదర్శి గోపీకాంత్ రెడ్డి జనవరి 5న ఉత్తర్వులు జారీచేశారు.
అర్హులైన అభ్యర్థులు జనవరి 12న సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు సుమారు 2 వేల దరఖాస్తులు వచ్చాయని నియామక సంస్థ వర్గాలు తెలిపాయి. కొన్ని స్పెషాలిటీ విభాగాల్లో ఒక పోస్టుకు అయిదుగురు చొప్పున, మరికొన్నింటిలో ఒక పోస్టుకు ఇద్దరు చొప్పున దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది.
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 34 విభాగాల్లో 1147 పోస్టులను భర్తీ చేయనున్నారు. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసున్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మొత్తం పోస్టుల్లో అధికంగా అనస్థీషియా విభాగంలో 155, జనరల్ సర్జరీలో 117, జనరల్ మెడిసిన్‌లో 111 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి డిసెంబరు 20న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 12న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు.
పోస్టుల వివరాలు..
* అసిస్టెంట్ ప్రొఫెసర్
ఖాళీల సంఖ్య: 1147 పోస్టులు
విభాగాలవారీగా ఖాళీలు..
అనాటమీ – 26
ఫిజియాలజీ – 26
పాథాలజీ – 31
కమ్యూనిటీ మెడిసిన్(ఎస్‌పీఎం) – 23
మైక్రో బయాలజీ – 25
ఫొరెన్సిక్ మెడిసిన్, టాక్సికాలజీ – 25
బయోకెమిస్ట్రీ – 20
ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ – 14
జనరల్ మెడిసిన్ – 111
జనరల్ సర్జరీ – 117
పీడియాట్రిక్స్ – 77
అనస్థీషియా – 155
రేడియో డయాగ్నోసిస్ – 46
రేడియేషన్ అంకాలజీ -05
సైకియాట్రి – 23
రెస్పిరేటరి మెడిసిన్ – 10
డెర్మటాలజీ – 13
ఒబెస్టిట్రిక్స్, గైనకాలజీ – 142
అప్తామాలజీ – 08
ఆర్థోపెడిక్స్ – 62
ఈఎన్టీ – 15
హాస్పిటల్ అడ్మిన్ – 14
ఎమర్జెన్సీ మెడిసిన్ – 15
కార్డియాలజీ – 17
కార్డియాక్ సర్జరీ – 21
ఎండోక్రైనాలజీ – 12
న్యూరాలజీ – 11
న్యూరో సర్జరీ – 16
ప్లాస్టిక్ సర్జరీ – 17
పీడియాట్రిక్ సర్జరీ -08
యూరాలజీ – 17
నెఫ్రాలజీ – 10
మెడికల్ అంకాలజీ -01