TGPSC Junior Lecturers (JL) Results out Now: తెలంగాణలో జూనియర్ లెక్చరర్ (JL) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ (JL) పోస్టుల నియామకాల తుది ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) విడుదల చేసింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యాక పోస్టులకు ఎంపికైన వారి జాబితాను కమిషన్ మంగళవారం నాడు విడుదల చేసింది. టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థులు తుది ఫలితాలు చెక్ చేసుకోవాలని కమిషన్ సూచించింది. https://websitenew.tspsc.gov.in/
జేఎల్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
జులై 8న జూనియర్ లెక్చరర్స్ రాత పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. జనరల్ ర్యాంకింగ్ జాబితాలను సబ్జెక్టులవారీగా ఇచ్చారు. 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు మాత్రం 1:5 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలనకు అభ్యర్థులను ప్రకటించారు. ఈ ప్రక్రియ పూర్తి చేసి జూనియర్ లెక్చరర్స్ జేఎల్ పోస్టులకు ఎంపికైన వారి జాబితాను సబ్జెక్టుల వారీగా అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేశారు. జేఎల్ పోస్టుల ప్రొవిజన్ లిస్టును టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్ సైట్‌లో చూసుకోవాలని కమిషన్ పేర్కొంది.
తెలంగాణలో 1392 జూనియర్ లెక్చరర్ల (Junior Lecturers) భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 9, 2022న నోటిఫికేషన్ విడుదల చేసింది. మల్టీ జోన్-1 లో 724 పోస్టులు, మల్టీ జోన్-2 లో 668 పోస్టులు ఉన్నాయి. డిసెంబరు 16 నుంచి 2023, జనవరి 6 వరకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించారు.
మొత్తం 16 సబ్జెక్టులకు 11 రోజుల పాటు ఉదయం జనరల్ స్టడీస్ పేపర్ ఎగ్జామ్ నిర్వహించారు. మధ్యాహ్నం అభ్యర్థులకు సంబంధిత సబ్జెక్టు పేపర్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల ఆన్సర్ కీని విడుదల చేసి వారి నుంచి అభ్యంతరాలు స్వీకరించింది.