హైదరాబాద్: పోటీ పరీక్షలకు ముఖ్యమైన టాపిక్ కరెంట్ అఫైర్స్. అటు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల్లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలకు సంబంధించిన ప్రశ్నలు కీలకం కానున్నాయి. ఎందుకంటే మిగతా టాపిక్స్ దాదాపుగా అలాగే ఉంటాయి. కానీ కరెంట్ అఫైర్స్ వారానికి, నెలకు, ఏడాదికి మారిపోతూ ఉంటాయి.


గత కొన్ని రోజుల వీక్లీ కరెంట్ అఫైర్స్


1. ఇటీవల శ్రీలంక దేశానికి మూడవ మహిళ ప్రధానిగా నియమితులైన ప్రధాన మంత్రి ఎవరు?-- హరణి అమర సూర్య (గత మహిళా ప్రధానులు సిరిమావో బండారునాయకే, చంద్రికా కుమారతుంగ)
2. ఇటీవల వార్తల్లోకి వచ్చిన "Why Bharat Matters"పుస్తక రచయిత ఎవరు?-- భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్. జై శంకర్
3. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?-- ఏప్రిల్ 24
4. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ 2024 విజేత ఎవరు?-- ఆర్యాన సబలెంకా (బెలారస్) 
5. ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రధానిగా ఎవరు వ్యవహరిస్తున్నారు?-- బెంజిమిన్ నెతన్యాహు
6. 2024 (జాతీయ పర్యాటక దినోత్సవం జనవరి 25) అయితే దీని యొక్క ఇతివృత్తము ఏమిటి?-- Sustainable Journeys, Timeless Memories
7. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పర్యావరణ, అటవీ శాఖల మంత్రి ఎవరు? -- కె.పవన్ కళ్యాణ్
8. దేశంలోనే ఉత్తమ పర్యాటక గ్రామముగా ఎంపికైన "దేవ్ మాలి "ఏ రాష్ట్రానికి చెందినది?-- రాజస్థాన్
9. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా ప్రస్తుతము ఎవరు వ్యవహరిస్తున్నారు?-- పర్వతనేని హరీష్
10. ఇటీవల వార్తల్లోకి వచ్చిన ప్రపంచంలో తొలి ఆదివారపు వార్తాపత్రిక ఏది?-- ది అబ్జర్వర్ (బ్రిటన్) 
11. ఐసీసీ మహిళా టి20 క్రికెట్ ప్రపంచ కప్ 2024 ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? వేదికలు ఏమిటి? యూఏఈ ఆతిథ్యమిస్తోంది. దుబాయ్, షార్జా వేదికగా మ్యాచ్‌లు
12. ప్రస్తుత భారత రైల్వే శాఖ మంత్రిగా ఎవరు వ్యవహరిస్తున్నారు?-- అశ్విని వైష్ణవ్
13. ఇటీవల వార్తల్లో నిలిచిన "మాధవి పూరి బచ్" ఏ సంస్థకు చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు?-- SEBI
14. భారతదేశంలోని మొట్టమొదటి రైస్ ఎ.టి.ఎం (ATM )ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము ప్రారంభించింది?-- ఒడిస్సా 
15. 2024 నాటికి పురుషులలో అత్యధిక గ్రాండ్ స్లామ్  సింగిల్స్ టైటిల్స్ ను గెలిచిన రికార్డు ఎవరి పేరును కలదు?-- నోవాక్ జోకోవిచ్ (సెర్బియా)
16. కేంద్ర ఎన్నికల సంఘం విభిన్న ప్రతిభావంతుల్లో ఎన్నికల అవగాహన కల్పించేందుకు ఎవరిని నేషనల్ ఐకాన్ గా నియమించింది?-- రాకేష్ కుమార్, శీతల దేవి (పారా ఆర్చరీ మిక్స్డ్)
17. ప్రస్తుత యూట్యూబ్ యొక్క సీఈఓ ఎవరు?-- నీల్ మోహన్
18. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ  నాసా(NASA)ను 1958లో స్థాపించడం జరిగింది. అయితే నాసా ప్రస్తుత అధిపతి ఎవరు?-- బిల్ నెల్సన్ 
19. భారత ప్రస్తుత( డి. ఆర్. డి. ఓ )చైర్మన్ ఎవరు?-- సమీర్ వి కామత్
20. జపాన్ దేశ నూతన ప్రధానమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు?-- షిగోరు ఇషిబా
21.  ఇటీవల ఏయో రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయ? హర్యానా, జమ్మూ కాశ్మీర్
22. ఇటీవల ఎక్కడ జరిగిన క్వాడ్ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు? అమెరికా


                                                              సేకరించిన వారు బొడ్డ శ్రీరామమూర్తి, ఎంఏ, బీఈడీ, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్, శ్రీకాకుళం జిల్లా