TS TET 2024 Notification: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET) 2024 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ మార్చి 14న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన పేపర్ ప్రకటన మార్చి 15న ప్రచురితమైంది. అయితే టెట్ అర్హతలు, వయోపరిమితి, ఇన్‌ఫర్మేషన్ బులిటిన్‌ను (పూర్థిస్థాయి నోటిఫికేషన్) మార్చి 20 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ సూచించింది. టెట్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 27 నుంచి ప్రారంభంకానుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. 


టీఎస్ టెట్- 2024 షెడ్యూలు (TS TET 2024 Schedule)..


➥ టెట్- 2024 నోటిఫికేషన్ వెల్లడి: 14.03.2024.


➥ టెట్- 2024 పూర్తిస్ధాయి నోటిఫికేషన్ అందుబాటులో: 20.03.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.03.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.04.2024.


➥ టెట్-2024 పరీక్ష నిర్వహణ: 20.05.2024 - 03.06.2024.



WEBSITE


డీఎస్సీ కంటే ముందే టెట్‌.. 
రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఫిబ్రవరి 29న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి విదితమే. మార్చి 4 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. డీఎస్సీ రాయాలంటే ముందుగా టెట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. తాజాగా టెట్ నిర్వహించకపోవడం వల్ల డీఎస్సీ-2024కు దరఖాస్తు చేసుకునే అర్హతను కోల్పోతామని డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై స్పందించిన డీఎస్సీ పరీక్షల కంటే ముందుగానే టెట్‌ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్చి 14న పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన మార్చి 14న టెట్‌-2024 నోటిఫికేషన్‌ జారీ చేశారు. తొలిసారిగా టెట్‌ పరీక్షలను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ)లో నిర్వహించనున్నట్టు ఆమె తెలిపారు. ఈ నిర్ణయంతో డీఎస్సీ రాసే వారి సంఖ్య భారీగా పెరగనుంది. టెట్‌లో వచ్చిన మార్కులకు టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్టు(TRT)లో 20 శాతం వెయిటేజీ ఇస్తున్నందున దీనికి భారీగా డిమాండ్ ఉంది. 


గతేడాది ఉత్తీర్ణత తక్కువే..
గతేడాది సెప్టెంబరులో నిర్వహించిన తెలంగాణ పేపర్-1లో 82,489 మంది(36.89%) ఉత్తీర్ణత సాధించగా.. పేపర్-2లో 29,073 మంది(15.30%) మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఇదే సమయంలో గురుకుల ఉపాధ్యాయులు, జూనియర్ లెక్చరర్ ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో పూర్తిస్థాయిలో సన్నద్ధత కాలేకపోయామని, అందువల్లే ఉత్తీర్ణత శాతం తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.


డీఎస్సీ దరఖాస్తు గడువు పొడిగింపు.. జులై 17 నుంచి పరీక్షలు
ప్రభుత్వం డీఎస్సీ పరీక్షల తేదీలను ప్రకటించడంతోపాటు.. దరఖాస్తు గడువునూ పెంచింది. ఈ మేరకు జులై 17 నుంచి 31 వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ కమిషనర్ వెల్లడించారు. అలాగే ఏప్రిల్ 4 వరకు ఉన్న దరఖాస్తును గడువును జూన్ 20 వరకు పొడిగించామని ప్రకటించారు. తాజాగా టెట్ నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో పొడిగించినట్లు వెల్లడించారు. డీఎస్సీ పరీక్షలను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తుండటంతో.. కనీసం 10 రోజులపాటు పరీక్షలు జరుగనున్నాయి. ఒకే అభ్యర్థి సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులతో పాటు స్కూల్‌ అసిస్టెంట్‌లో గణితం, ఫిజిక్స్‌ వంటి వివిధ సబ్జెక్టులకు పోటీపడనున్న నేపథ్యంలో పరీక్షలను వేర్వేరు తేదీల్లో నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌, డగఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...