తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ ఆగస్టు 1న విడుదలైన సంగతి తెలిసిందే. ఆగస్టు 2 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు ఆగస్టు 16 వరకూ దరఖాస్తులు సమర్పించవచ్చు. సెప్టెంబరు 15న కంప్యూటర్ ఆధారిత విధానంలో 'టెట్' పరీక్ష నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 27న టెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.400 చెల్లించాల్సి ఉంటుంది.
టెట్-2023కు సంబంధించి పేపర్-1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అర్హత ఉన్నవారు రాయడానికి అర్హులు. అదేవిధంగా బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు పేపర్-2తోపాటు పేపర్-1 పరీక్ష కూడా రాసుకునే అవకాశం కల్పించారు. ప్రస్తుతం విద్యా సంవత్సరం చివరి ఏడాది చదివుతున్నవారు కూడా టెట్ రాయడానికి అర్హులే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 15న టెట్ పేపర్-1, పేపర్-2 పరీక్షలు జరుగనున్నాయి. సెప్టెంబరు 15న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.
తెలంగాణ టెట్ నోటిఫికేషన్, పరీక్ష విధానం పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ముఖ్యమైన తేదీలు..
➥ టెట్-2023 నోటిఫికేషన్ వెల్లడి: 01.08.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 02.08.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేది: 16.08.2023.
➥ హెల్ప్ డెస్క్ సేవలు అందుబాటులో: 01.08.2023 - 15.08.2023.
➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 09.09.2023.
➥ టెట్ పరీక్ష తేదీ: 15.09.2023.
పేపర్-1: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.
పేపర్-2: మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు.
ALSO READ:
టీఎస్‌పీఎస్సీ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖలో అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నియామక పరీక్ష హాల్‌టికెట్లను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆగస్టు 1న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు,. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 8న కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
'గ్రూప్-2' పరీక్ష తేదీల్లో మార్పుల్లేవ్! షెడ్యూలు ప్రకారమే పరీక్షల నిర్వహణ
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 29,30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించనుంది. అయితే గ్రూప్-3 పరీక్ష తేదీల ఖరారుతోపాటు గ్రూప్-1 మెయిన్స్, కళాశాల లెక్చరర్లు, సంక్షేమ వసతిగృహాల అధికారులు (హెచ్‌డబ్ల్యూవో), డివిజినల్ అకౌంట్స్ అధికారుల (డీఏవో) పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు 'గ్రూప్-2' పరీక్షను వాయిదా వేయాలని కమిషన్‌ను ఆశ్రయిస్తున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
3049 పోస్టులతో ఐబీపీఎస్ పీవో నోటిఫికేషన్ వచ్చేసింది, దరఖాస్తు ప్రారంభం
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎంటీ) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ (సీఆర్‌పీ-పీవో XIII) విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 3049 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఐబీపీఎస్ పీవో పోస్టుల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 1న ప్రారంభంకాగా.. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175; ఇతరులు రూ.850 చెల్లించి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 21 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రెండు దశల రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..