తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) 2023 ఫలితాలు సెప్టెంబర్‌ 27న విడుదలయ్యాయి. ఉదయం 10 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ టెట్ హాల్‌టికెట్ నెంబరు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాలతోపాటు సబ్జెక్టులవారీగా తుది ఆన్సర్ ‘కీ’ని కూడా అధికారులు విడుదల చేశారు. సెప్టెంబరు 15న నిర్వహించిన టెట్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని సెప్టెంబరు 20న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి సెప్టెంబరు 23 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. ఇక సెప్టెంబరు 27న తుది ఆన్సర్‌ కీతోపాటు ఫలితాలను విడుదల చేశారు. 


Download Results - TSTET 2023

TSTET Final Key - 2023


రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబ‌రు 15న‌ 2,052 కేంద్రాల్లో నిర్వహించిన టెట్ పేపర్‌-1 పరీక్షకు 84.12 శాతం, మధ్యాహ్నం నిర్వహించిన పేపర్‌ -2 పరీక్షకు 91.11 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్-1 పరీక్షకు 2,69,557 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,26,744 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక బీఈడీ విద్యార్థులకే అర్హత ఉన్న పేపర్-2 పరీక్షకు 2,08,498 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 1,89,963 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇప్పటికే ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. టెట్‌ ఫలితాల ప్రకటన అనంతరం అందులో ఉత్తీర్ణులైన వారు కూడా దరఖాస్తు చేసే వీలుంటుంది. ఈ కారణంగానే టెట్‌ ఫలితాలను త్వరితగతిన ప్రకటించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.


ALSO READ:


యూపీఎస్సీ- సీఏపీఎఫ్‌ 2023 రాత పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్‌-2023 రాత పరీక్ష ఫలితాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) సెప్టెంబరు 26న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పీడీఎఫ్ ఫార్మాట్‌లో రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు వివరాలను యూపీఎస్సీ విడుదల చేసింది. కేంద్ర సాయుధ బలగాలైన బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ త‌దిత‌ర ద‌ళాల్లో అసిస్టెంట్ క‌మాండెంట్ పోస్టుల భ‌ర్తీకి "సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్‌-2023" నోటిఫికేష‌న్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏప్రిల్ 26న విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..


యూపీఎస్సీ ఎన్డీఏ, ఎన్‌ఏ-2 2023 రాతపరీక్ష ఫలితాలు విడుదల, ఇలా చూసుకోండి!
UPSC NDA Results 2023: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC NDA & NA (2) - 2023) నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నేవల్ అకాడమీ రాతపరీక్ష ఫలితాలు సెప్టెంబరు 26న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. సెప్టెంబరు 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన ఎన్డీఏ రాతపరీక్షకు హాజరైన అభ్యర్ధులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. మొత్తం 395 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో ఎంపికైన అభ్యర్థుల వివరాలను పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో యూపీఎస్సీ అందుబాటులో ఉంచింది. అభ్యర్థుల మార్కుల వివరాలను 15 రోజుల్లో వెల్లడించనున్నట్లు యూపీఎస్సీ తెలిపింది. అదేవిధంగా తర్వాతి దశలో ఇంటర్వ్యూలు పూర్తయిన 30 రోజుల్లోగా తుది ఎంపిక ఫలితాలను వెల్లడించనున్నట్లు యూపీఎస్సీ వెల్లడించింది. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఆర్మీ వెబ్‌సైట్‌లో 14రోజుల్లోగా రిజిస్టర్ చేసుకోవాలి. ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ వివరాలను అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా పంపుతారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..