TSPSC Group2 Revised Posts: తెలంగాణలో గ్రూప్-2 అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ నుంచి కీలక అప్‌డేట్ వెలువడింది. గ్రూప్‌-2 పోస్టుల భర్తీలో జీవో3 ప్రకారం మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించినట్టు టీఎస్‌పీఎస్సీ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ఉద్యోగాల భర్తీకి మహిళలకు సమాంతర రిజర్వేషన్లను అమలు చేస్తున్నందున.. 'గ్రూప్‌-2' నోటిఫికేషన్‌లో ఖాళీల వివరాలకు సంబంధించిన రివైజ్డ్‌ బ్రేకప్‌ను కమిషన్ ఏప్రిల్ 19న ప్రకటించింది. ఈ రివైజ్డ్‌ ఖాళీల బ్రేకప్‌లో మహిళలకు రోస్టర్‌పాయింట్‌ తొలగించి, అన్ని ఖాళీలను రిజర్వు కేటగిరీల వారీగా వెల్లడించింది. ఈ సవరణ బ్రేకప్‌ వివరాలు కమిషన్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్‌2 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్‌ 29న నోటిఫికేషన్‌ ఇచ్చారు.


రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 783 'గ్రూప్-2' పోస్టుల భర్తీకి 2022, డిసెంబరు 29న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, తహసిల్దార్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.


* గ్రూప్-2 పోస్టుల వివరాలు


మొత్తం ఖాళీల సంఖ్య: 783


1) మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-3): 11 పోస్టులు


విభాగం: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్. 


2) అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (ఏసీటీవో): 59 పోస్టులు


విభాగం: కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్సెస్ డిపార్ట్‌మెంట్.


3) నాయబ్ తహసిల్దార్: 98 పోస్టులు


విభాగం: ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్.


4) సబ్-రిజిస్ట్రార్ (గ్రేడ్-2): 14 పోస్టులు


విభాగం: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్‌మెంట్.


5) అసిస్టెంట్ రిజిస్ట్రార్: 63 పోస్టులు


విభాగం: కంట్రోల్ ఆఫ్ కమిషనర్- కోఆపరేషన్ & రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్.


6) అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్: 09 పోస్టులు


విభాగం: కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్‌మెంట్.


7) మండల్ పంచాయత్ ఆఫీసర్: 126 పోస్టులు


విభాగం: పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్.


8) ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్: 97 పోస్టులు


విభాగం: ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్.


9) అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 38 పోస్టులు


 విభాగం: హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ డిపార్ట్‌మెంట్.


10) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 165 పోస్టులు


 విభాగం: జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్.


11) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 15 పోస్టులు


 విభాగం: లెజిస్లేటివ్ సెక్రటేరియట్.


12) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 25 పోస్టులు


 విభాగం: ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్.


13) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 07 పోస్టులు


 విభాగం: లా డిపార్ట్‌మెంట్.


14) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 02 పోస్టులు


 విభాగం: తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్. 


15) డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ (గ్రేడ్-2): 11 పోస్టులు


 విభాగం: జువైనల్ కరెక్షనల్ సర్వీసెస్ & వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ డిపార్ట్‌మెంట్. 


16) అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 17 పోస్టులు


 విభాగం: బీసీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్. 


17) అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 09 పోస్టులు


 విభాగం: ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్. 


18) అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ ఎస్సీ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 17 పోస్టులు


 విభాగం: ఎస్సీ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్. 


Group2 Revised Breakup


Group2 Notification


ఏప్రిల్ 22 నుంచి గ్రూప్‌ -4 స్పోర్ట్స్‌ అభ్యర్థులకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ 
గ్రూపు-4 ఉద్యోగాలకు స్పోర్ట్స్‌ కోటాలో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 22 నుంచి మే 3 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఉదయం 11 గంటల నుంచి టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో జరిగే ఈ సర్టిఫికెట్‌ పరిశీలనకు అభ్యర్థులు అన్ని రకాల స్పోర్ట్స్‌ ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, 2 పాస్‌ఫోటోలు తెచ్చుకోవాలని తెలిపింది.


'అగ్రి' పోస్టుల దివ్యాంగ అభ్యర్థులకు వైద్యపరీక్షలు..
వ్యవసాయ సహకార శాఖలో ఉద్యోగాలకు ఎంపికై, సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన ప్రత్యేక క్యాటగిరీ (దివ్యాంగ) అభ్యర్థులకు మెడికల్‌ పరీక్షలు నిర్వహంచనున్నట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఈ మేరకు జాబితాను ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ.. కేటాయించిన తేదీల్లో మెడికల్‌ పరీక్షలకు ఉదయం 9 గంటలకు హాజరుకావాలని ప్రకటించింది. దృష్టిలోపం అభ్యర్థులు మెహదీపట్నంలోని సరోజినిదేవీ కంటి దవాఖానలో, అంగవైకల్యం అభ్యర్థులు అఫ్జల్‌గంజ్‌లోని ఉస్మానియా దవాఖానలో, వినికిడి లోపం అభ్యర్థులు కోఠిలోని ఈఎంటీ దవాఖానలో హాజరుకావాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...