ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి నియామక ప్రక్రియలో ఈవెంట్స్ మరో రెండు రోజుల్లో ముగియనున్నాయి. దీంతో తుది రాత పరీక్ష నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి(టీఎస్ఎల్‌పీఆర్‌బీ) దృష్టి సారించింది. మార్చి 12 నుంచి ఏప్రిల్ 23 వరకు తుది రాతపరీక్షలు నిర్వహించేందుకు ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనేపథ్యంలో ప్రైమరీ రాతపరీక్షలో వలే అర్హత మార్కులు తగ్గించే అవకాశాలున్నాయా? అనే సందేహాలు అభ్యర్థుల్లో నెలకొన్నాయి. గతంలో జనరల్ అభ్యర్థులకు 80.., బీసీలకు 70.., ఎస్సీ, ఎస్టీ/మాజీ సైనికోద్యోగులకు 60  అర్హత మార్కులుగా ఉండేవి. నియామక ప్రక్రియపై గతేడాది ఏప్రిల్ 25న వెలువడిన నోటిఫికేషన్‌లో మాత్రం ప్రైమరీ రాతపరీక్ష అర్హత మార్కుల్ని అన్ని వర్గాల అభ్యర్థులకూ 60 మార్కులుగానే నిర్ణయించారు. 



అర్హత మార్కుల తగ్గింపు లేనట్లే
ప్రైమరీ రాతపరీక్ష ఫలితాలు వెల్లడించే తరుణంలో దీనిపై ఎస్సీ, ఎస్టీ/మాజీ సైనికోద్యోగ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సీఎం ఆదేశాల మేరకు కటాఫ్ మార్కుల్లో మార్పులు చేశారు. జనరల్ అభ్యర్థులకు 60.. బీసీ అభ్యర్థులకు 50.. ఎస్సీ, ఎస్టీ/మాజీ సైనికోద్యోగులకు 40  కటాఫ్‌ మార్కులుగా ఖరారు చేసి ప్రాథమిక రాతపరీక్ష ఫలితాల్ని ప్రకటించారు.  తుది రాతపరీక్షలోనూ కటాఫ్ మార్కుల తగ్గింపుపై ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే అలాంటి అవకాశం లేదని జనరల్ అభ్యర్థులు 80, బీసీ అభ్యర్థులు 70, ఎస్సీ, ఎస్టీ/మాజీ సైనికోద్యోగులు 60 మార్కులు సాధిస్తేనే అర్హత సాధిస్తారని పోలీస్ నియామక మండలి స్పష్టం చేసింది. 


తుది ఎంపిక ప్రక్రియ..

ప్రైమరీ రాతపరీక్షలో 5 తప్పుడు సమాధానాలకు ఒక మార్కును తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే తుది రాతపరీక్షలో నెగెటివ్ మార్కులు ఉండవు కాబట్టి రెండు విడతల పరీక్షల్లో ప్రశ్నపత్రాలు బహుళైచ్ఛిక సమాధానాలతో కూడినవే అవడంతో మండలి ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ప్రైమరీ రాతపరీక్షలో నెగెటివ్ మార్కుల విధానంలో అర్హత సాధించిన అభ్యర్థులు ఇటు ఈవెంట్స్‌లోనూ అర్హత సాధించగలిగితేనే సత్తా ఉన్నట్లుగా పరిగణించి తుది రాతపరీక్షలో నెగెటివ్ మార్కుల విధానాన్ని తీసివేసినట్లు మండలి పేర్కొంది. అన్ని వర్గాల అభ్యర్థులు అర్హత మార్కుల్ని సాధిస్తేనే తుది ఎంపిక ప్రక్రియ కోసం పరిగణనలోకి తీసుకుంటామని మండలి ప్రకటించింది. 


Also Read:


తెలంగాణ 'గ్రూప్-3' నోటిఫికేషన్ విడుదల, 1365 ఖాళీల భర్తీకి 24 నుంచి దరఖాస్తులు!
తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతూనే ఉంది. వరుసపెట్టి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబరు 30న గ్రూప్-3 నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1365 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వివిధ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, సీనియర్ ఆడిటర్, అసిస్టెంట్ ఆడిటర్, అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్-3 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 24 నుంచి ప్రారంభంకానుంది. పోస్టుల అర్హతలు, ఇతర వివరాలను జనవరి 24 నుంచే పూర్తి నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 23 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణలో 'గ్రూప్-2' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల పూర్తి వివరాలు ఇలా! 
తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం కొత్త సంవత్సర కానుకగా శుభవార్త తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 783 'గ్రూప్-2' పోస్టుల భర్తీకి డిసెంబరు 29న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, తహసిల్దార్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...