TGPSC Group 4 Merit List: తెలంగాణలో గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించి ధ్రవపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూన్ 9న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల హాల్‌టికెట్ నెంబర్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులకు మొత్తం 23,999 మంది అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులు జూన్ 13 నుంచి వెబ్‌ఆప్షన్లు నమోదుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు తప్పనిసరిగా వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలని కమిషన్ సూచించింది. ఆప్షన్లు ఇచ్చుకున్న వారిని మాత్రమే ధ్రువపత్రాల పరిశీలనకు అనుమతిస్తామని టీజీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూలును త్వరలోనే వెల్లడించనున్నట్లు కమిషన్ స్పష్టంచేసింది. అభ్యర్థులు పరిశీలన కోసం అవసరమైన అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని అభ్యర్థులకు సూచించింది. 


గ్రూప్-4 ఫలితాల కోసం క్లిక్ చేయండి..


సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఇవి అవసరం.. 


1) వెబ్‌సైట్‌లో సూచించిన ప్రకారం చెక్ లిస్ట్ (1 సెట్) ఉండాలి.


2) దరఖాస్తు సమయంలో సమర్పించి అప్లికేషన్ ఫామ్ (పీడీఎఫ్) ప్రింట్ కాపీ  


3) పరీక్ష హాల్‌టికెట్


4) పుట్టినతేదీ ధ్రువీకరణ కోసం పదోతరగతి మార్కుల మెమో. 


5) 1 నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు లేదా ప్రైవేట్/ఓపెన్ స్కూల్‌లో చదివిన అభ్యర్థులైతే రెసిడెన్స్/స్థానికత సర్టిఫికేట్ ఉండాలి. 


6) డిగ్రీ లేదా పీజీ ప్రొవిజినల్/ కాన్వొకేషన్ సర్టిఫికేట్, మార్కుల మెమో. 


7) ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ (అందులో తల్లిదండ్రుత పేర్లు తప్పనిసరిగా ఉండాలి).


8) బీసీ వర్గానికి చెందినవారైతే నాన్-క్రీమిలేయర్ సర్టిఫికేట్ ఉండాలి. ఇతర బీసీ సర్టిఫికేట్లు అంగీకరించరు.


9) రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులగుతై వయోపరిమితి సడలింపు కోసం సర్వీస్ సర్టిఫికేట్/NCC  ఇన్‌స్ట్రక్టర్/ఎక్స్-సర్వీస్‌మెన్ సర్టిఫికేట్/ సెన్సస్ సర్వీస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. 


10) పీహెచ్ సర్టిఫికేట్ (SADERAM సర్టిఫికేట్).


11) ఇన్-సర్వీస్ అభ్యర్థులైతే NOC తప్పనిసరి. 


12) గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసిన రెండు సెట్ల అటెస్టేషన్ సర్టిఫికేట్ కాపీలు ఉండాలి. 


13) నోటిఫికేషన్‌ సమయంలో పేర్కొన్న అన్ని ఇతర సర్టిఫికేట్లు తీసుకురావాలి. 


14) మూడు ఫొటోలు


15) నిరుద్యోగులు, హిందువులు అయితే డిక్లరేషన్ (పోస్ట్ కోడ్ 70కి) ఇవ్వాలి.


తెలంగాణలో మొత్తం 8,180 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి జులై 1న రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష కోసం  రాష్ట్రవ్యాప్తంగా 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 80 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పేపర్‌-1కు 7,62,872 మంది, పేపర్-2కు 7,61,198 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్ష ఆన్సర్ 'కీ'ని టీఎస్‌పీఎస్సీ ఆగస్టు 28న విడుదల చేసింది. ఆన్సర్ కీలో అభ్యంతరాలు తెలియజేసేందుకు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్‌ 4 అవకాశం కల్పించింది. అనంతరం అక్టోబరు 6న ఫైనల్ కీని టీఎస్‌పీఎస్సీ విడుదల చేయగా.. పలు మార్పులు చోటుచేసుకున్నాయి.


గ్రూప్-4 అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితాలను ఫిబ్రవరి 9న కమిషన్ విడుదల చేసింది.  ఈ నేపథ్యంలో.. మహిళలకు సమాంతర రిజర్వేషన్ల నేపథ్యంలో 8,180 గ్రూప్-4 ఉద్యోగాల ప్రకటన (నోటిఫికేషన్ నెం.19/2022)కు సవరణ ఖాళీల జాబితా (Revised Breakup)ను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. గ్రూప్-4 భర్తీలో రోస్టర్ విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త రోస్టర్ విధానం, మహిళలకు రోస్టర్ పాయింట్ లేకుండా ఖాళీల వివరాలను అందుబాటులో ఉంచారు. గతంలో విధించిన రోస్టర్ విధానాన్ని ఉపసంహరించారు. జిల్లాలవారీగా కేటాయించిన ఉద్యోగ వివరాల జాబితాను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది.


గ్రూప్-4 సవరించిన ఖాళీల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..