Crime News: ఎంతో గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తప్పు చేసిందని చూసి తట్టుకోలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి వాళ్లు మన ఫ్యామీలీలో ఉండొద్దని వారిని మాత్రం వదలొద్దని చెబుతూ ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. సూర్యపేట జిల్లా హుజూర్ నగర్‌లో జరిగిన ఈ దుర్ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.  


సూర్యపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన రంజిత్‌ ఫొటో గ్రాఫర్‌. పక్క గ్రామంలోనే యువతిని 14 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు కుమార్తెలు. సాఫీగా సాగిపోతున్న వీరి జీవితంలోకి మూడో వ్యక్తి వచ్చాడు. అంతే మొత్తం మారిపోయింది. ఫ్యామిలీ కకావికలమై ఇంటి పెద్దనే కోల్పోయింది. 


రంజిత భార్య స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో వివాహేతర సబంంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న రంజిత్ ఆమెను మార్చేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ ఆమెలో మార్పు రాలేదు. ఈ విషయంపై ఇద్దరి మధ్య రోజూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. 


ప్రతి రోజూ గొడవలు జరుగుతుండటంతో రంజిత్ భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనలో మరింత ఆందోళనకు గురయ్యాడు రంజిత. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కాక మానసింగా కుంగిపోయాడు. అద్దెకు ఉంటున్న ఇంటిని ఖాళీ చేశాడు. 


ఇద్దరి పిల్లల్ని తీసుకొని తన చెల్లి ఇంటికి వెళ్లిపోయాడు. అక్కడ కూడా భార్య గురించే ఆలోచించాడు. శుక్రవారం సడెన్‌గా తాము గతంలో ఉన్న ఇంటికి వచ్చాడు. అక్కడే ఉరి వేసుకొని చనిపోయాడు. అప్పటికే ఆ ఇల్లు ఖాలీగా ఉండటంతో దాన్ని ఎవరూ గమనించలేదు. సాయంత్రానికి ఆ ఇంటి నుంచి వాసన వస్తుండటంతో స్థానికులు గమనించారు. 


రంజిత్ డెడ్‌బాడీని చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి డెడ్‌బాడీని కిందికి దించి పోస్టు మార్టానికి పంపించారు. రంజిత్ చనిపోక ముందు ఓ వీడియోను షూట్ చేశాడు. దాన్ని వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టుకున్నాడు. ఆలస్యంగా స్నేహితులు దాన్ని చూశాడు. అప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 


భార్య చేసిన మోసాన్ని భరించలేకపోతున్నానని... మర్చిపోలేకపోతున్నట్టు అందులో తెలిపారు. ఇద్దరు పిల్లల్ని సరిగా చూసుకోవాలని తమ్ముడికి అప్పగించాడు. తాను ఇక ఉండలేనంటూ చెల్లెలకు చెప్పిన విధానం అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. తనను మోసం చేసిన భార్యను ఆమెతో సంబంధం పెట్టుకున్న వ్యక్తిని అసలు విడిచి పెట్టొద్దని మాత్రం చెప్పాడు. 


ఆ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. రంజిత్ భార్య, ఆమెతో సంబంధం పెట్టుకున్న వ్యక్తిని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. అధికారికంగా ఎలాంటి సమాచారం మాత్రం పోలీసులు ఇవ్వలేదు. వారిని రహస్యంగా విచారిస్తున్నారని పోలీసుల వర్గాలు చెబుతున్నాయి.