TGPSC Junior Lecturers (JL) General Ranking List: తెలంగాణలో ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో జూనియర్‌ లెక్చరర్‌ (JL) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) జులై 8న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితా(GRL)లను సబ్జెక్టులవారీగా అందుబాటులో ఉంచింది. త్వరలోనే 1:2 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెల్లడించనున్నట్లు కమిషన్ తెలిపింది. అయితే పీడబ్ల్యూడీ అభ్యర్థులకు మాత్రం 1:5 నిష్పత్తిలో జాబితాను ప్రకటించనున్నట్లు కమిషన్ వెల్లడించింది.


జేఎల్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..




తెలంగాణలో 1392 జూనియర్ లెక్చరర్ల భర్తీకి టీఎస్‌పీఎస్సీ 2022, డిసెంబరు 9న నోటిఫికేషన్ విడుదలచేసిన సంగతి తెలిసిందే. మొత్తం పోస్టులు మల్టీ జోన్-1 పరిధిలో 724 పోస్టులు, మల్టీ జోన్-2 పరిధిలో 668 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల నుంచి డిసెంబరు 16 నుంచి 2023, జనవరి 6 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులకు సెప్టెంబర్‌ 12 నుంచి అక్టోబర్‌ 3 వరకు పరీక్షలు నిర్వహించారు.


మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్ 150 ప్రశ్నలు-150 మార్కులు (ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు), పేపర్-2 అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి 150 ప్రశ్నలు 300 మార్కులు (ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు) ఉంటాయి. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాల సమయం కేటాయించారు. 


మొత్తం 16 సబ్జెక్టులకు 11 రోజుల పాటు ఉదయం జనరల్ స్టడీస్ పేపర్, మధ్యాహ్నం సంబంధిత సబ్జెక్టు పేపర్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల ఆన్సర్ కీని సెప్టెంబరు 23 నుంచి విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించింది. తాజాగా పరీక్షకు హాజరైన అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది.


పోస్టుల వివరాలు: 1392


మల్టీ జోన్-1: 724 పోస్టులు
- ఆసిఫాబాద్-కుమ్రంభీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు
- ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల
- కరీంనగర్, సిరిసిల్ల-రాజన్న, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి
- కొత్తగూడెం-భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ (వరంగల్ అర్బన్), వరంగల్ (వరంగల్ రూలర్)


మల్టీ జోన్-2: 668 పోస్టులు
- సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి-యాదాద్రి, జనగామ
- మేడ్చల్-మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్
- మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాంబ-గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూలు



గ్రూప్-1 మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులు అర్హత..
తెలంగాణలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిర్వమించిన ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు టీజీపీఎస్సీ జులై 7న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫలితాలతోపాటు, ఫైనల్ ఆన్సర్ కీని కమిషన్ విడుదల చేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు హాజరైన అభ్యర్థుల్లో మెయిన్స్‌ పరీక్షకు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరికి అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజూ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రూప్-1లో మొత్తం 563 పోస్టులుండగా, ఒక్కో పోస్టుకు 536 మంది చొప్పున పోటీపడుతున్నారు. మల్టీ జోన్‌, రోస్టర్‌ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్‌కు ఎంపికచేశారు.  
గ్రూప్-1 ప్రిలిమినరీ రిజల్ట్స్, ఫైనల్ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...