TGPSC AEE Final Results Announced:: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్స్‌(ఏఈఈ) ఉద్యోగాల రాతపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. మొత్తం 1540 పోస్టులకుగాను 1,154 మంది అభ్యర్థుల ఎంపిక జాబితాను కమిషన్ విడుదల చేసింది. ఏఈఈ ఫలితాలకు సంబంధించి మిషన్ భగీరథలో ఉద్యోగాలకు మల్టీ జోన్-1 పరిధిలో 195 మంది, మల్టీ జోన్-2 పరిధిలో 98 మంది ఎంపియ్యారు. పంచాయతీరాజ్ విభాగానికి సంబంధించి మల్టీ జోన్-1 పరిధిలో 117 మంది, మల్టీ జోన్-2 పరిధిలో 89 మంది ఎంపికయ్యారు. పబ్లిక్ హెల్త్ విభాగంలో మల్టీ జోన్-1 పరిధిలో 14 మంది, మల్టీ జోన్-2 పరిధిలో 132 మంది ఎంపికయ్యారు. ట్రైబల్ వెల్ఫేర్ విభాగంలో మల్టీ జోన్-1, 2 పరిధి కలిపి 15 మంది ఎంపికయ్యారు. అదేవిధంగా కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ (CAD) విభాగంలో మల్టీ జోన్-1 పరిధిలో 136 మంది, మల్టీ జోన్-2 పరిధిలో 215 మంది ఎంపికయ్యారు. ఇక ప్రజారవాణా, రోడ్లు & భవనాల శాఖకు సంబంధించి మల్టీ జోన్-1 పరిధిలో 73 మంది, మల్టీ జోన్-2 పరిధిలో 70 మంది ఎంపికయ్యారు.


ఏఈఈ రాతపరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి..


Website




తెలంగాణలో ఏఈఈ నియామాకాలకు నిర్వహించిన ఎంపిక ఫలితాలను టీఎస్‌పీఎస్సీ మార్చి 13న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థులకు మార్చి 18 నుంచి 22 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించారు. మొత్తం 1540 పోస్టులకుగాను 1:2 నిష్పత్తిలో 3092 మంది అభ్యర్థులను సర్టిఫికేట్ల పరిశీలనకు టీఎస్‌పీఎస్సీ ఎంపికచేసింది. వీరిలో అగ్రికల్చర్ ఇంజినీరింగ్ విభాగంలో 188 మంది అభ్యర్థులు, సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో 2362 మంది అభ్యర్థులు, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో 338 మంది అభ్యర్థులు, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో 204 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు అర్హత సాధించారు. సర్టిఫికెట్లు వెరిఫికేషన్‌ ముగిసినప్పటికీ తుది ఫలితాలు విడుదలలో తీవ్ర జాప్యం ఏర్పడింది. దీంతో అభ్యర్థులు టీజీపీఎస్సీ కార్యాలయం ముందు ఆందోళనలు నిర్వహించారు. ఎట్టకేలకు ఆగస్టు 3న ఎంపిక ఫలితాలను కమిషన్ విడుదల చేసింది.


తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1540 పోస్టుల భర్తీకి 2022, సెప్టెంబరు 3న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ)  నోటిఫికేషన్ విడుదలు చేసిన సంగతి తెలిసిందే. మొదట ఉద్యోగాల భర్తీకి సంబంధించి వెబ్ నోటీస్ విడుదల చేసిన కమిషన్, సెప్టెంబర్ 15న పూర్తి నోటిఫికేషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 15 వరకు దరఖాస్తు గడువు నిర్ణయించారు. అయితే దరఖాస్తు గడువు పొడిగించాలంటూ అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు రావటంతో అక్టోబర్ 20 వరకు అవకాశం కల్పించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 21, 22 తేదీల్లో సివిల్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగాలకు సంబంధించిన పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహించారు. మే 8న ఎలక్ట్రికల్‌ & ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌; మే 9న అగ్రికల్చర్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్ అభ్యర్థుల‌కు ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించింది. ఇక మే 21, 22 తేదీల్లో రెండు షిప్టుల్లో ఏఈఈ(సివిల్) పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో ప‌రీక్ష నిర్వహించింది. తాజాగా ఫలితాలను విడుదల చేసింది. తుది స్కోరు ఖ‌రారులో నార్మలైజేష‌న్ ప‌ద్ధతిని పాటించింది. 


పోస్టుల వివరాలు.. 


* అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్ ​ఇంజినీర్​(ఏఈఈ) పోస్టులు


మొత్తం ఖాళీల సంఖ్య: 1540


1)   ఏఈఈ(సివిల్)- పీఆర్‌ఆర్‌డీ డిపార్ట్‌మెంట్  (మిషన్ భగీరథ): 302 పోస్టులు     


2)   ఏఈఈ(సివిల్)- పీఆర్‌ఆర్‌డీ ‌డిపార్ట్‌మెంట్: 211 పోస్టులు    


3)  ఏఈఈ (సివిల్) ఎంఏ యూడీ- పీహెచ్: 147 పోస్టులు    


4)  ఏఈఈ(సివిల్) టీడబ్ల్యూ డిపార్ట్ మెంట్: 15 పోస్టులు


5)  ఏఈఈ ఐ‌సీఏడీ డిపార్ట్ మెంట్: 704 పోస్టులు    


 6)  ఏఈఈ (మెకానికల్) ఐసీఏడీ(జీడబ్ల్యూడీ): 03 పోస్టులు    


 7)  ఏఈఈ (సివిల్) టీఆర్‌బీ: 145 పోస్టులు    


 8)  ఏఈఈ (ఎలక్ట్రికల్) టీఆర్‌బీ: 13 పోస్టులు    


జీతం: రూ.54,220- రూ.1,33,630.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...