TGPSC Exams Schedule: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కీలక అప్డేట్‌ను ఇచ్చింది.  రాష్ట్రంలోని వివిధ శాఖల్లో గతంలో జారీ చేసిన నోటిఫికేషన్లకు రిక్రూట్‌మెంట్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ పరీక్షలన్నీ కంప్యూటర్ ఆధారిత టెస్ట్ (CBT) విధానంలోనే నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.

Continues below advertisement

పరీక్షల షెడ్యూల్  

  1. పోస్టుల వారీగా TGPSC ప్రకటించిన పరీక్ష తేదీల వివరాలు ఇలా ఉన్నాయి:
  2. పీసీబీ అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-II): తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అక్టోబర్ 24న CBT విధానంలో పరీక్ష జరగనుంది.
  3. అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్: పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టులకు అక్టోబర్ 26న పరీక్ష నిర్వహించనున్నారు.
  4. ఆర్ అండ్ బి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్): రోడ్లు, భవనాల శాఖలో AEE (సివిల్) పోస్టులకు నవంబర్ 6, 7 తేదీల్లో రెండు రోజుల పాటు పరీక్షలు నిర్వహించనున్నారు.  
  5. డిప్యూటీ ఈఓ / గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్-I: పాఠశాల విద్యాశాఖ పరిధిలోని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ (DEO), గెజిటెడ్ హెడ్ మాస్టర్ పోస్టులకు నవంబర్ 12, 13 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. Also Read: స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

అభ్యర్థులకు ముఖ్య సూచనలు

టీజీపీఎస్సీ పరీక్షలన్నీ కంప్యూటర్ ఆధారిత విధానంలోనే జరుగుతాయని అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా తమ ప్రిపరేషన్‌ను వేగవంతం చేసుకోవాలని కమిషన్ సూచించింది. పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు, పరీక్షా కేంద్రాల పూర్తి సమాచారాన్ని త్వరలోనే TGPSC అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేస్తూ ఉండాలని అధికారులు సూచించారు.  

Also Read: ఇగ్నోలో 43 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ.. దరఖాస్తు విధానం, అర్హతలు ఇవే!

Continues below advertisement