IGNOU Recruitment: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు ఆహ్వానించింది. మొత్తం 43 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ignou.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు, కేటగిరీల వారీగా  

  1. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 43 పోస్టులను భర్తీ చేయనున్నారు. 
  2. ప్రొఫెసర్ పోస్టులు: 21
  3. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు: 16
  4. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు: 6
  5. కేటగిరీల వారీగా ఖాళీలు: 
  6. జనరల్-12, ఓబీసీ-15, ఎస్సీ-8, ఎస్టీ-5, పీడబ్ల్యూబీడీ (PwBD) అభ్యర్థులకు 3 పోస్టులు కేటాయించారు. అభ్యర్థులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో, స్క్రీనింగ్, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్ 20, 2026
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 20, 2026
  • హార్డ్ కాపీ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన వచ్చిన 30 రోజుల్లోపు లేదా అక్టోబర్ 30, 2026 లోపు అకడమిక్ కోఆర్డినేషన్ డివిజన్‌కు పంపించాలి.  

జీతం 

దరఖాస్తు విధానం

  1. అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ ignou.ac.inలో నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి.
  2. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్‌లో వ్యక్తిగత, విద్యా వివరాలను నమోదు చేయాలి.
  3. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్/క్రెడిట్ కార్డు ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
  4. ఫామ్ సమర్పించిన తర్వాత ప్రింటౌట్ తీసుకోవాలి.
  5. ఆన్‌లైన్ ఫామ్ ప్రింటవుట్‌ను, స్వీయ ధృవీకరించిన పత్రాల కాపీలతో కలిపి "అకడమిక్ కోఆర్డినేషన్ డివిజన్, IGNOU, మైదాన్ గర్హి, న్యూఢిల్లీ-110068" ఈ చిరునామాకు పోస్ట్ ద్వారా పంపాలి. Also Read: రైల్వేలో 1688 ఉద్యోగాలు.. RRB NTPC Jobs నోటిఫికేషన్- ముఖ్యమైన తేదీ, ఫీజు వివరాలు