Telangana High Court Jobs: తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీస్‌లో జిల్లా జడ్జీ పోస్టుల భర్తీకి హైదరాబాద్‌లోని తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 9 ఖాళీలను భర్తీచేయనున్నారు. తెలంగాణ జ్యుడీషియల్ నియమ నిబంధనల ప్రకారం నిర్ధేశించిన అర్హతలు కలిగి ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 14 నుంచి జూన్ 13 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. స్క్రీనింగ్ టెస్ట్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), రాత పరీక్ష, వైవా-వాయిస్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో పరీక్ష నిర్వహిస్తారు.


వివరాలు.. 


* జిల్లా జడ్జీ (DJ) పోస్టులు 


ఖాళీల సంఖ్య: 09.


పోస్టుల కేటాయింపు: ఈడబ్ల్యూఎస్-01, ఎస్స-02, ఎస్టీ-01, ఎస్ఈబీ-05. 


అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్ లా డిగ్రీ అర్హత ఉండాలి. హైకోర్టు లేదా హైకోర్టు పరిధిలో పనిచేసే ఏదైనా కోర్టుల్లో ఏడేళ్ల పాటు అడ్వకేట్ లేదా ప్లీడర్‌గా ప్రాక్టీస్ ఉండాలి. తెలంగాణ జ్యుడీషియల్ నియమ నిబంధనల ప్రకారం నిర్ధేశించిన అర్హతలు కలిగి ఉండాలి.


వయోపరిమితి: అభ్యర్థులు 14.05.2024 నాటికి 35-48 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. అభ్యర్థులు Registrar (Recruitment), High Court, Telanganam Hyderabad పేరిట నిర్ణీత మొత్తంతో డిమాండ్ డ్రాఫ్ట్ (డిడి) తీయాలి.


దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ ద్వారా. వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి, నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి.


ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.


పరీక్ష విధానం..
➥ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదట 100 మార్కులకు స్క్రీనింగ్ టెస్ట్ (సీబీటీ) నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నలకు ఒకమార్కు కేటాయించారు. పరీక్ష సమయం 2 గంటలు. 


➥ స్క్రీనింగ్ పరీక్షలో 40 % లేదా ఆపై మార్కులు సాధించిన అభ్యర్థుల్లో 1:10 నిష్పత్తిలో రాతపరీక్షకు ఎంపికచేస్తారు. రాతపరీక్షలో మొత్తం మూడు పేపర్లు (కాన్‌స్టిట్యూష్ & సివిల్ లా, క్రిమినల్ లా, ఇంగ్లిష్ ట్రాన్స్‌లేషన్) ఉంటాయి. ఒక్కో పేపరుకు 100 మార్కుల చొప్పున, మూడు పేపర్లుకు 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిష్ ట్రాన్స్‌లేషన్ పేపర్‌లో (పార్ట్-1) 30 మార్కులకు ట్రాన్స్‌లేషన్, 70 మార్కులు ఎస్సే రైటింగ్ (పార్ట్-2) ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇంగ్లిష్‌లోకి వ్యాసాలు రాయాల్సి ఉంటుంది. అయితే ఇంగ్లిష్ పేపరును కేవలం అర్హత పరీక్షగా మాత్రమే పరిగణిస్తారు.


➥ రాతపరీక్షలో కనీస అర్హత మార్కులను  ఒక్కో పేపరులో 60 శాతంగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ (40 శాతానికి పైగావైకల్యం) అభ్యర్థులకు 50 శాతంగా నిర్ణయించారు.   


వైవా-వాయిస్: మొత్తం 30 మార్కులకు వైవా-వాయిస్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ పరీక్షకు హాజరుకాని వారిని ఉద్యోగ ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి 1:3 నిష్పత్తిలో వైవా-వాయిస్‌కు అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఇందులో అర్హత మార్కులుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 40 శాతం మార్కులు, ఇతరులు 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. 


జీతం: ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.1,44,840 - రూ.1,94,660 జీతంగా ఇస్తారు.


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: 
The Chief  Secretary,
Government of Telangana,
General Administration Department, 
Telangana Secretariat, 
Hyderabad-500022.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.05.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 13.06.2024. (సాయంత్రం 5 గంటల్లోపు)


➥ రాతపరీక్ష తేదీ: 24, 25.08.2024.


Notification & Application


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..