తెలంగాణ గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. డిగ్రీ కాలేజీల్లో 868 అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. జూనియర్ కళాశాలల్లో 2008 లెక్చరర్లు, పాఠశాలల్లో 1276 పీజీటీ, 434 లైబ్రేరియన్, 275 ఫిజికల్ డైరెక్టర్, 134 ఆర్ట్స్, 92 క్రాఫ్ట్, 124 మ్యూజిక్, 4020 టీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 12 నుంచి వన్ టైం రిజిస్ట్రేషన్.. 17 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ మల్లయ్యభట్టు తెలిపారు.
క్ర.సం. | పోస్టు పేరు | పోస్టుల సంఖ్య |
1. | డిగ్రీ లెక్చరర్ పీడీ, లైబ్రేరియన్ | 868 |
2. | జూనియర్ లెక్చరర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ | 2008 |
3. | పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) | 1276 |
4. | ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ) | 4090 |
5. | లైబ్రేరియన్ స్కూల్ | 434 |
6. | ఫిజికల్ డైరెక్టర్స్ ఇన్ స్కూల్ | 275 |
7. | డ్రాయింగ్ టీచర్స్ ఆర్ట్ టీచర్స్ | 134 |
8. | క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్ క్రాఫ్ట్ టీచర్స్ | 92 |
9. | మ్యూజిక్ టీచర్స్ | 124 |
మొత్తం ఖాళీలు | 9231 |
మొత్తం పోస్టులు 13వేలకు పైగానే..
తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నది. క్రమంగా విస్తరించుకుంటూ పోతున్నది. రాష్ర్ట ఏర్పాటు నాటికి 123 గురుకుల పాఠశాలలు ఉండగా, వాటిని 1011లకు పెంచింది. అంతేగాకుండా వాటిని క్రమంగా పాఠశాల స్థాయి నుంచి ఇంటర్, డిగ్రీ స్థాయికి విస్తరించుకుంటూ పోతున్నది. ఈ క్రమంలో ఆయా గురుకులాల్లో శాశ్వత ప్రతిపాదికన పోస్టుల భర్తీని క్రమంగా చేపడుతున్నది. మూడేళ్ల క్రితమే ఆయా గురుకులాల్లో 10వేల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టగా, తాజాగా అంతేకు మించి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తంగా ప్రభుత్వం తొలుత 9096పోస్టులను ఖాళీలుగా గుర్తించింది. అటు తరువాత మరో 33 బీసీ గురుకులాలు, 15డిగ్రీ కళాశాలల మంజూరు చేయగా అందుకు సంబంధించిన పోస్టులను కూడా భర్తీ చేయాలని నిర్ణయించింది. దీంతో మరో 3వేల పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయగా, మొత్తంగా బోధన, బోధనేతర సిబ్బందికి సంబంధించి 13,530 పోస్టులను ఖాళీలుగా గుర్తించడంతోపాటు అందుకు ప్రభుత్వం అమనుతి సైతం మంజూరు చేసింది. తాజాగా వాటి భర్తీకి ట్రిబ్ చర్యలు చేపట్టింది.
మరో వెయ్యి పోస్టులకు త్వరలో నోటిఫికేషన్..
మొత్తంగా 13,675 పోస్టుల్లో గ్రూప్3, గ్రూప్ 4 పోస్టుల మినహా మిగతా 10,675 పోస్టుల భర్తీని ట్రిబ్ ద్వారా చేపట్టనున్నారు. అందులో తొలిదఫాగా ప్రస్తుతం 9231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మిగతా పోస్టులకు సంబంధించి అందులో కొన్ని కొత్తగా, మెస్ ఇన్‌చార్జి, మరికొన్ని పోస్టులకు సర్వీస్ రూల్స్‌ను రూపొందించాల్సి ఉంది. అదికాకుండా కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. వాటన్నింటినీ పరిష్కరించి మరో వారం రోజుల్లో మిగిలిన పోస్టుల భర్తీకి సైతం నోటిఫికేషన్ జారీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇక గురుకులాలకు మంజూరైన ఏఎన్ఎం, స్టాఫ్ నర్స్ పోస్టులను మెడికల్ బోర్డు చేపట్టనుంది. ఆ నేపథ్యంలో ఎలాంటి వివాదాలు లేని పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టింది.
Also Read:
కేంద్ర కొలువులకు నోటిఫికేషన్ - 69 పోస్టులు, అర్హతల వివరాలు ఇలా!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వివిధ సంస్థల్లో పనిచేయుటకు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా ఏప్రిల్ 13లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.25 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఈపీఎఫ్‌వోలో 2674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు, వివరాలు ఇలా!
న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దేశ వ్యాప్తంగా రెగ్యులర్ ప్రాతిపదికన ఈపీఎఫ్‌వో- రీజియన్ల వారీగా సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 2674 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌లో టైపింగ్ స్పీడ్‌గా చేయగలగాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..