New posts for Telangana VRAs Adjustment: తెలంగాణలో వీఆర్ఏల స‌ర్దుబాటు విషయంలో కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో వీఆర్​ఏ ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు కొత్త పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది.  వివిధ శాఖ‌ల్లో కొత్తగా 14,954 పోస్టులను సృష్టించింది. ఈ పోస్టుల మంజూరుకు ఆర్థికశాఖ అనుమ‌తి ఇచ్చింది. ప్రభుత్వం మంజూరుచేసిన ఖాళీల్లో.. రెవెన్యూ శాఖ‌లో 2,451 జూనియ‌ర్ అసిస్టెంట్ పోస్టులు, పుర‌పాల‌క శాఖ‌లో 1,266 వార్డు ఆఫీస‌ర్ పోస్టులు, రెవెన్యూ శాఖ‌లో 679 స‌బార్డినేట్ పోస్టులు, నీటిపారుద‌ల శాఖ‌లో 5063 ల‌ష్కర్, హెల్పర్ పోస్టులు, మిష‌న్ భ‌గీర‌థ శాఖ‌లో 3,372 పోస్టులు, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో 2,113 రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల‌ను కొత్తగా సృష్టించింది.


ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన పోస్టులు..


➥ నీటిపారుద‌ల శాఖ‌: 5063 ల‌ష్కర్, హెల్పర్ పోస్టులు


➥  మిష‌న్ భ‌గీర‌థ: 3,372 పోస్టులు


➥ రెవెన్యూ శాఖ‌: 2,451 జూనియ‌ర్ అసిస్టెంట్ పోస్టులు


➥ రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌: 2,113 రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు 


➥ పుర‌పాల‌క శాఖ‌: 1,266 వార్డు ఆఫీస‌ర్ పోస్టులు


➥ రెవెన్యూ శాఖ‌: 679 స‌బార్డినేట్ పోస్టులు


ALSO READ:


పోస్టాఫీసుల్లో కొలువుల జాతర, 30 వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి! తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టాఫీసుల్లో 30,041 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్ షెడ్యూల్-2, జులై 2023) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.10,000 - రూ.12,000 ప్రారంభ వేతనం అందుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 23 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.ఆంధ్రప్రదేశ్‌లో 1,058, తెలంగాణలో 961 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్ సేవక్‌లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇంటెన్సివ్ ఆధారపడి ఉంటుంది. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్/ కంప్యూటర్/ స్మార్ట్ ఫోన్ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్ తొక్కడం రావాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


1207 'స్టెనోగ్రాఫ‌ర్' పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా!
స్టాఫ్ సెలక్షన్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) స్టెనోగ్రాఫ‌ర్ ఎగ్జామినేష‌న్ - 2023 ప్రక‌ట‌న‌ను ఆగస్టు 2న విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల్లో 1207 స్టెనోగ్రాఫ‌ర్ (గ్రేడ్-సి, గ్రేడ్-డి) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టైపింగ్ తెలిసి ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి...


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...