Telangana Govt Medical Jobs: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మొత్తం 5,348 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. పబ్లిక్ హెల్త్ & వెల్ఫేర్, ఆయుష్, డ్రగ్ కంట్రోల్, డీసీఏ, ఐపీఎం, డీఎంఈ, వైద్య విధాన పరిషత్ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో ఉద్యోగాల భర్తీకి కూడా ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. వైద్యారోగ్య సర్వీసుల నియామక బోర్డు ద్వారా నేరుగా ఉద్యోగాల భర్తీ చేపట్టాలని సూచించారు. ఈ ఉద్యోగాల భర్తీకి జూన్‌లో నోటిఫికేషన్ వెలువడే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

 

మొత్తం ఖాళీల్లో అత్యధికంగా వైద్యవిద్య డైరెక్టర్(డీఎంఈ) పరిధిలో 3,235 పోస్టులను భర్తీ చేయనున్నారు. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుతో పాటు బోధనాసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారు. భర్తీ చేసే పోస్టుల్లో 1,988 మంది స్టాఫ్ నర్సులు; 1,014 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు; 764 మంది ల్యాబ్ టెక్నీషియన్లు; 596 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు తదితరాలు ఉన్నాయి. రాష్ట్ర వైద్యారోగ్య సేవలు రిక్రూట్ మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ద్వారా నియామక ప్రక్రియ జరుగుతుంది.

 

విభాగాలవారీగా ఖాళీలు..


➥ వైద్యవిద్య డైరెక్టర్(డీఎంఈ) పరిధిలో: 3,235 పోస్టులు


➥ వైద్యవిధాన పరిషత్‌: 1255 పోస్టులు


➥ ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖ: 575 పోస్టులు


➥ ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి: 212 పోస్టులు


➥ ఐపీఎంలో 34 పోస్టులు


➥ ఆయుష్: 26 పోస్టులు


➥ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్: 11 పోస్టులు  


భర్తీచేసే పోస్టులు ఇవే పోస్టులు..


➥ స్టాఫ్ నర్సులు: 1,988 


➥ సివిల్ అసిస్టెంట్ సర్జన్లు: 1,014 


➥ ల్యాబ్ టెక్నీషియన్లు: 764


➥ అసిస్టెంట్ ప్రొఫెసర్లు: 596


➥ ఇతర పోస్టులు: 986





మొత్తం ఖాళీల్లో హెడ్ ఆఫ్ డిపార్ట్ మెంట్‌లో 3,235 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 1255 పోస్టులు, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ లో 11, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటిక్ మెడిసిన్‌లో34 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. కాగా, వైద్యశాఖలో ఖాళీలను భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ అనుమతిస్తూ మార్చి 12న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 2021 అక్టోబర్ నుంచి ఖాళీగా ఉన్న 4356 పోస్టులను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ చేయాలని ఆదేశించింది. ఈ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రావాల్సి ఉంది. 


రాష్ట్రంలోని జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన క్రమంలో.. వాటిలో బోధనా సిబ్బందిని నియమించేందుకు వైద్యారోగ్య సిద్ధమైంది. మెడికల్ కాలేజీల్లోని ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు ఇలా అన్ని కలిపి ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. త్వరలో పూర్తి నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం స్థానికత ఆధారంగా ఉన్న ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, అర్హతకు సంబంధించిన వివరాలను ఆయా విభాగాల అధిపతుల నుంచి తీసుకోవాలని చెప్పారు. ఆయా వివరాల ఆధారంగా నోటిఫికేషన్ ఇచ్చి నేరుగా ఖాళీలను భర్తీ చేయాలని తెలిపారు.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...