ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాటర్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలోని 'వాటర్ గ్రౌండ్ & వాటర్ ఆడిట్' విభాగం కాంట్రాక్ట్ విధానంలో జిల్లాల వారీగా టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా(సివిల్ ఇంజినీరింగ్)తో పాటు సంబంధిత పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల వయసు 35 ఏళ్లలోపు ఉండాలి. ఆన్‌లైన్ విధానంలో అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

వివరాలు:

టెక్నికల్ అసిస్టెంట్: 74 పోస్టులు

జిల్లాల వారీ ఖాళీలు:

1. శ్రీకాకుళం: 02 పోస్టులు

2. విజయనగరం: 01 పోస్టు

3. పార్వతీపురం మన్యం: 02 పోస్టులు

4. అల్లూరి సీతారామ రాజు: 04 పోస్టులు

5. విశాఖపట్నం: 02 పోస్టులు Also Read:  DMHO Recruitment: అనంతపురం జిల్లా ఆరోగ్యశాఖలో ఖాళీలు, అర్హతలివే! 6. అనకాపల్లి: 02 పోస్టులు

7. కాకినాడ: 02 పోస్టులు

8. డా.అంబేడ్కర్ కోనసీమ: 01 పోస్టు

9. తూర్పుగోదావరి: 02 పోస్టులు

10. పశ్చిమ గోదావరి: 01 పోస్టు

11. ఏలూరు: 02 పోస్టులు

12. కృష్ణా: 02 పోస్టులు

Also Read: ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 207 టీచర్ పోస్టులు

13. ఎన్టీఆర్: 02 పోస్టులు

14. గుంటూరు: 01 పోస్టు

15. పల్నాడు: 03 పోస్టులు

16. బాపట్ల: 01 పోస్టు

17. ప్రకాశం: 04 పోస్టులు

18. నంద్యాల: 03 పోస్టులు

19. కర్నూలు: 03 పోస్టులు

20. అనంతపురం: 05 పోస్టులు

Also Read:  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 714 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు, అర్హతలివే!

21. శ్రీ సత్యసాయి: 03 పోస్టులు

22. వైఎస్ఆర్, కడప: 04 పోస్టులు

23. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు: 05 పోస్టులు

24. తిరుపతి: 04 పోస్టులు

25. అన్నమయ్య: 04 పోస్టులు

26. చిత్తూరు: 04 పోస్టులు

27. డైరెక్టర్ కార్యాలయం, జీడబ్ల్యూ డబ్ల్యూఏడీ, విజయవాడ: 05 పోస్టులు

అర్హత: డిప్లొమా(సివిల్ ఇంజినీరింగ్)తో పాటు సంబంధిత పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 31 మార్చి, 2022 నాటికి 35 ఏళ్లలోపు ఉండాలి.

జీతం: నెలకు రూ.18,000 (టూర్ అలవెన్స్ నెలకు రూ.5,000) Also Read: నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌‌లో 226 ఉద్యోగాలు, వివరాలు ఇలా! దరఖాస్తు విధానం: అన్‌లైన్ దరఖాస్తులను, అవసరమైన సర్టిఫికేట్లతో పాటు సంబంధిత జిల్లాల జిల్లా భూగర్భ జల అధికారులకు పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా అందజేయాలి.

ముఖ్యమైన తేదీలు..

* దరఖాస్తుకు చివరి తేదీ: 30.09.2022 (మధ్యాహ్నం 3 గంటల వరకు)

* ఇంటర్వ్యూ తేదీ: 11.10.2022.

వేదిక: సంబంధిత జిల్లా భూగర్భ జలం, జల గణన శాఖ అధికారి కార్యాలయంలో హాజరుకావాల్సి ఉంటుంది.

Notification

Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...