తెలంగాణలో స్కూల్ అసిస్టెంట్ల బదిలీలకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ శుక్రవారం (సెప్టెంబరు 30) సాయంత్రం ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి మొదలవుతుందని ప్రకటించినప్పటికీ.. సాంకేతిక కారణాల వల్ల ఆప్షన్ల ప్రక్రియ ఆలస్యంగా మొదలైంది. ఆప్షన్లకు శనివారం అర్ధరాత్రి వరకు గడువుఇచ్చారు. టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్(టీఆర్‌టీ)కి సెప్టెంబరు 20 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభంకాగా 10 రోజుల్లో 16,399 మందే దరఖాస్తు చేశారు. రాష్ట్రంలోని మల్టీ జోన్-1 పరిధిలో 19 జిల్లాల్లోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు, అలాగే మల్టీ జోన్-2లో కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోని వారికే బదిలీలు జరపాలని విద్యాశాఖ నిర్ణయించింది.
స్పౌజ్ పాయింట్లు వినియోగించుకుంటున్న వారు తమ భార్య లేదా భర్త పనిచేస్తున్న ప్రాంతానికి దగ్గర్లోని పాఠశాలలను మాత్రమే ఎంచుకోవాలని, ఈ మేరకు డీఈఓలు పరిశీలించి బదిలీ ఉత్తర్వులు జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన సెప్టెంబరు 26న ఆదేశించిన సంగతి తెలిసిందే.
వెబ్ ఆప్షన్ల నమోదు కోసం క్లిక్ చేయండి..
రాష్ట్రంలో 5,089 ఉపాధ్యాయ కొలువుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడినా అభ్యర్థుల నుంచి స్పందన తక్కువగా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా టెట్ మార్కులు వచ్చినందున వేగం పెరగవచ్చని భావిస్తున్నారు.
అక్టోబరు 21 వరకు డీఎస్సీ దరఖాస్తుకు అవకాశం..
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 20న ప్రారంభమైన సంగతి తెలిసిందే. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబర్ 20లోగా నిర్ణీత ఫీజు చెల్లించి, అక్టోబరు 21లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబర్ 20 నుంచి 30 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించునున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని 44 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది. ఇక దివ్యాంగులకు మాత్రం 10 సంవత్సరాలపాటు వయోసడలింపు ఉంటుంది.
డీఎస్సీ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
డీఎడ్ అభ్యర్థులకే ఎస్జీటీ పోస్టులు..
తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) ఉద్యోగాలను డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) అభ్యర్థులతోనే భర్తీ చేయాలని నిర్ణయించింది. ఒకట్రెండు రోజుల్లోనే దీనికి సంబంధించిన జీవో విడుదలయ్యే అవకాశముంది. తాజా నిర్ణయంతో బీఈడీ అర్హత ఉన్న అభ్యర్థులు కేవలం స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) పోస్టులకు మాత్రమే పోటీపడాల్సి ఉంటుంది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వారికి అర్హత కల్పిస్తూ 2018లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే రాజస్థాన్ ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు వేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ప్రాథమిక పాఠశాలల్లోని టీచర్ పోస్టులను డీఎడ్ అర్హత ఉన్న వారితోనే భర్తీ చేయాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు కాపీని ఎన్సీటీఈ తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు దేశమంతటా అమలు కానుంది.
ALSO READ:
కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్ వచ్చేసింది, పోస్టుల వివరాలు ఇలా
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 'కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్ర గనుల శాఖ, జలవనరుల శాఖలో గ్రూప్-ఎ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించి అక్టోబరు 10లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న ప్రిలిమినరీ పరీక్ష; జూన్ 22న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఐసీఎంఆర్-ఎన్‌ఐఆర్‌టీలో 78 టెక్నికల్, ల్యాబొరేటరీ అటెండెంట్ ఉద్యోగాలు
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఇన్ ట్యుబర్‌క్యులోసిస్' గ్రూప్ బి, సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..