దిగ్గజ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మహిళలకు శుభ వార్త చెప్పింది. ఉద్యోగాలు చేసి.. అనుకోని కారణాల వల్ల కెరీర్‌లో గ్యాప్ వచ్చిన మహిళలకు ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఐటీ రంగంలో 2 నుంచి 5 ఏళ్ల అనుభవం ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అనుభవం, నైపుణ్యంతో పాటు సామర్థ్యం ఉన్న మహిళలకు తమదైన ముద్ర వేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. కేవలం ఒకే ఇంటర్వ్యూ ద్వారా అర్హులను ఎంపిక చేస్తామని వివరించింది. రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నోటిఫికేషన్ సహా మరిన్ని వివరాల కోసం టీసీఎస్ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని అభ్యర్థులకు సూచించింది.
2 నుంచి 5 ఏళ్ల అనుభవం..
దేశవ్యాప్తంగా ఈ నియమకాలు చేపట్టనున్నట్లు టీసీఎస్ తెలిపింది. డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించడంతో పాటు.. 2 నుంచి 5 ఏళ్ల అనుభవం కలిగిన మహిళలు దీనికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ వివరాలను వారు రిజిస్టర్డ్ ఈ-మెయిల్‌కు పంపిస్తామని చెప్పింది.
ఏమేం నైపుణ్యాలు కావాలంటే?
జావా డెవలపర్, డాట్‌నెట్ డెవలపర్, ఆండ్రాయిడ్ డెవలపర్, ఐఓఎస్ డెవలపర్, ఆటోమేషన్ టెస్టింగ్, పర్‌ఫెర్మాన్స్ టెస్టింగ్ కన్సల్టెంట్, ఎస్‌క్యూఎల్ సర్వర్ డీబీఏ, లైనక్స్ అడ్మినిస్ట్రేటర్, నెట్‌వర్క్ అడ్మిన్, మెయిన్ ఫ్రేమ్ అడ్మిన్, యాంగ్యులర్ జేఎస్, ఒరాకిల్ డీబీఏ, సిట్రిక్స్ అడ్మినిస్ట్రేటర్, విండోస్ అడ్మిన్, పైథాన్ డెవలపర్, పీఎల్ ఎస్‌క్యూఎల్. అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- టీసీఎస్ అధికారిక వెబ్‌సైట్ https://www.tcs.com/ను క్లిక్ చేయండి.
- ఇందులో కెరీర్స్ (Careers) ఆప్షన్ ఎంచుకోండి.
- ఇక్కడ రీబిగెన్, ఎక్స్ పీరియెన్స్ డ్ ప్రొఫెషనల్స్, ఎంట్రీ లెవల్ హైరింగ్ అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.
- వీటిలో రీబిగెన్ (Re Begin) అనే ఆప్షన్ ఎంచుకోండి.
- ఇందులో ఎక్ ప్లోర్ ఆపర్షునిటీస్ అనే ఆప్షన్ ఉంటుంది. మీ విద్యార్హత, అనుభవానికి తగిన ఉద్యోగాలను ఎంచుకోండి.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పైన చెప్పిన నైపుణ్యాల ఆధారంగా అభ్యర్థులు తమ వివరాలను అందించాలి.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల ఈమెయిల్ ఐడీకి ఇంటర్వ్యూ వివరాలను పంపుతారు.
- కేవలం ఒకే రౌండ్ ఇంటర్వ్యూ ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు.
Also Read: Amazon Jobs: ఈ నెల 16న అమెజాన్ జాబ్ మేళా.. 8 వేల ఉద్యోగాలు భర్తీ.. హైదరాబాద్‌లో కూడా..
Also Read: IND vs ENG, 5th Test: రద్దైన టెస్టును మళ్లీ నిర్వహించండి... ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డును కోరిన BCCI