ముంబయిలోని టాటా మెమోరియల్‌ సెంటర్‌ దేశవ్యాప్తంగా ఉన్న టాటా మెమోరియల్‌ హాస్పిటల్స్‌లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా మొత్తం 405 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 22 నుంచి 2023 జనవరి 20 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల సమర్పించవచ్చు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఖాళీలు భర్తీచేస్తారు.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 405


1) లోయర్ డివిజన్ క్లర్క్: 18 పోస్టులు

అర్హత:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌తో పాటు మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లో కనీసం 3 నెలల వ్యవధి గల 'ఎంఎస్-సీఐటీ' లేదా కంప్యూటర్ కోర్సు,  కంప్యూటర్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిప్లొమా లేదా డిగ్రీ ఉన్న అభ్యర్థులకు 3 నెలల కంప్యూటర్ కోర్సు నుండి మినహాయింపు ఉంది.

వయసు:
10.01.2023 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు.

అనుభవం:
అభ్యర్థులకు కనీసం 01 సంవత్సరకాలం పాటు క్లరికల్ పని అనుభవం కలిగి ఉండాలి.

జీతం:
నెలకు రూ. 19,900 చెల్లిస్తారు.



2)  అటెండెంట్: 20 పోస్టులు


అర్హత:
గుర్తింపు పొందిన బోర్డు నుండి ఎస్‌ఎస్‌సీ లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయసు:
10.01.2023 నాటికి 25 సంవత్సరాలు మించకూడదు.

అనుభవం:
అభ్యర్థికి ఫైలింగ్, రికార్డ్ కీపింగ్, డిస్పాచ్ వర్క్, ఫోటోకాపీ మెషిన్ ఆపరేటింగ్, ఆఫీసు పనిలో సహాయం చేయడం, డస్టింగ్ మరియు క్లీనింగ్ మొదలైన వాటిలో కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.

జీతం:
నెలకు రూ. 18,000 చెల్లిస్తారు.



3) ట్రేడ్ హెల్పర్: 70 పోస్టులు


అర్హత:
గుర్తింపు పొందిన బోర్డు నుండి ఎస్‌ఎస్‌సీ లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయసు:
10.01.2023 నాటికి 25 సంవత్సరాలు మించకూడదు.

అనుభవం:
ఆపరేషన్ థియేటర్/ఐసీయూ/డయాగ్నస్టిక్ సర్వీసెస్/ల్యాబొరేటరీ/ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధించి మెయింటెనెన్స్, క్లీనింగ్‌లో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.

జీతం:
నెలకు రూ. 18,000 చెల్లిస్తారు.



4) నర్సు-ఎ: 212 పోస్టులు


అర్హత:
జనరల్ నర్సింగ్ & మిడ్ వైఫరీతోపాటు డిప్లొమా (ఆంకాలజీ నర్సింగ్) లేదా బేసిక్/ పోస్ట్ బేసిక్ బీఎస్సీ (నర్సింగ్) 

వయసు:
10.01.2023 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.

అనుభవం:
ఏడాది క్లినికల్ అనుభవం ఉండాలి.

జీతం:
నెలకు రూ.44,900 చెల్లిస్తారు.
 

5) నర్స్-బి: 30 పోస్టులు


అర్హత:
జనరల్ నర్సింగ్ & మిడ్ వైఫరీతోపాటు డిప్లొమా (ఆంకాలజీ నర్సింగ్) లేదా బీఎస్సీ (నర్సింగ్)/ పోస్ట్ బేసిక్ బీఎస్సీ (నర్సింగ్) ఉండాలి.

వయసు:
10.01.2023 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.

అనుభవం:
6 సంవత్సరాల క్లినికల్ అనుభవం ఉండాలి.

జీతం:
నెలకు రూ.47,600 చెల్లిస్తారు.



6)  నర్స్-సి: 55 పోస్టులు


అర్హత:
జనరల్ నర్సింగ్ & మిడ్ వైఫరీతోపాటు డిప్లొమా (ఆంకాలజీ నర్సింగ్) లేదా బీఎస్సీ (నర్సింగ్)/ పోస్ట్ బేసిక్ బీఎస్సీ (నర్సింగ్) ఉండాలి.

వయసు:
10.01.2023 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.

అనుభవం:
12 సంవత్సరాల క్లినికల్ అనుభవం ఉండాలి.

జీతం:
నెలకు రూ.53,100 చెల్లిస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా.


పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. వీటిలో పార్ట్-ఎ 50 మార్కులు, పార్ట్-బి (డిస్క్రిప్టివ్) 50 మార్కులు ఉంటాయి. పార్ట్-ఎలో ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు 
ఉంటుంది. పార్ట్-బిలో ఎస్సే రైటింగ్, కాంప్రహెన్షన్, లెటర్ రైటింగ్, గ్రామర్ అంశాలు ఉంటాయి. పరీక్ష సమయం 3 గంటలు.  


స్కిల్ ‌టెస్ట్: 50 మార్కులకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో కంప్యూటర్ ప్రొఫీషియన్స్-30 మార్కులు, కమ్యూనికేషన్ ఆప్టిట్యూడ్-20 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 45 నిమిషాలు. 


ముఖ్యమైనతేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.12.2022.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 20.01.2023.


Notification & Online Application

Website 


Also Read:


మహానది కోల్‌ఫీల్డ్స్‌లో 295 ఉద్యోగాలు, అర్హతలివే!
ఒడిశా రాష్ట్రంలోని బుర్లా, జాగృతీ విహార్‌లోని మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో మొత్తం 295 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జనవరి 3 నుంచి 23 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులను మహానది కోల్ ఫీల్డ్స్/ కోల్ ఇండియా లిమిటెడ్‌లోని ఏ ఖనులు లేదా ప్రాజక్టుల్లోనైనా నియమించొచ్చు. కోల్ ఇండియా అనుబంధ సంస్థలకూ బదిలీ చేయొచ్చు. కాబట్టి దేశంలో ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండే అభ్యర్థులే దరఖాస్తు చేయాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


1392 జేఎల్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలోని జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 20న ప్రారంభమైంది. అభ్యర్థులు జనవరి 10న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తు చేసుకోవచ్చు. వాస్తవానికి డిసెంబరు 16 నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకావాల్సి ఉన్నప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల డిసెంబరు 20న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.200, పరీక్ష ఫీజు కింద రూ.120 చెల్లించాలి. నిరుద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు పరీక్ష ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...