సూరత్‌లోని సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎస్‌వీఎన్‌ఐటీ) వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనీద్వారా మొత్తం 50 పోస్టులను భర్తీ చేయనున్నారు. పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 50 పోస్టులు
* అసిస్టెంట్ ప్రొఫెసర్
విభాగాలు: సివిల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్&ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్&కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ &హ్యుమానిటీస్.
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన, పరిశోధన అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 60 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలు, ఎస్‌వీఎన్‌ఐటీ యొక్క అధ్యాపకులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేయాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీత భత్యాలు: నెలకు రూ.101,500 నుంచి రూ.167,400.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24.04.2023.
దరఖాస్తు హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేదీ: 04.05.2023.
Also Read:
21 నుంచి ఎస్సీటీ ఎస్‌ఐ పరీక్ష హాల్‌టికెట్లు! పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్ఎల్‌పీఆర్‌బీ) మార్చి 26న ఎస్‌సీటీ ఎస్‌ఐ టెక్నికల్ పేపర్ రాతపరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు మార్చి 21 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. అభ్యర్థలు మార్చి 21న ఉదయం 8 గంటల నుంచి హాల్‌టికెట్లు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మార్చి 24న అర్ధరాత్రి 12 గంటల వరకు అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
సీఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(ఏఎస్ఐ) స్టెనో పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను సీఆర్‌పీఎఫ్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవారు వెబ్‌సైట్‌లోని లాగిన్ పేజీలో తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏఎస్ఐ స్టెనో ఉద్యోగాల భర్తీకి మార్చి 27న కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహించనున్నారు.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1284 కానిస్టేబుల్ పోస్టులు, వివరాలు ఇలా!
భారత కేంద్రహోం మంత్రిత్వశాఖ పరిధిలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ఫిజికల్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 26న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 27 వరకు కొనసాగనుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..