SBI Recruitment of Trade Finance Officer (MMGS-II): దేశీయ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)' రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 150 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా విభాగంలో డిగ్రీ, ఐఐబీఎఫ్ ఫారెక్స్ సర్టిఫికేట్‌తో పాటు ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్‌లో రెండేళ్ల పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. సరైన అర్హతలు ఉన్నవారు జనవరి 23 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, మెరిట్ లిస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 150 పోస్టులు
* ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్-II) పోస్టులు
మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్-స్కేల్ II: 150 పోస్టులు
అర్హతలు: ప్రభుత్వం గుర్తింపు పొందిన యూనివర్సిటి లేదా ఇన్‌స్టిట్యూషన్ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ అండ్ ఐఐబీఎఫ్ ఫారెక్స్ సర్టిఫికేట్(31.12.2024 తేదీ నాటికి కలిగి ఉండాలి). డాక్యుమెంటరీ క్రెడిట్ స్పెషలిస్ట్‌లకు సీడీసీఎస్(CDCS)
సర్టిఫికేషన్/ ట్రేడ్ ఫైనాన్స్‌లో సర్టిఫికేట్ / ఇంటర్నేషనల్ బ్యాంకింగ్‌లో సర్టిఫికేట్(31.12.2024 తేదీ నాటికి ఉండాలి) కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
అనుభవం: ఫారిన్ బ్యాంక్‌తో సహా ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లో సూపర్‌వైజరీ రోల్‌లో ఎగ్జిక్యూటివ్‌గా ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్‌లో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. పోస్ట్ ఎసెన్షియల్ అకడమిక్ క్వాలిఫికేషన్ అనుభవం కలిగి ఉండాలి.
స్కిల్స్: అత్యుత్తమ కమ్యూనికేషన్, ప్రెజెంటేషన్ మరియు ప్రాసెసింగ్ నైపుణ్యాలు కలగి ఉండాలి.
ప్రొబేషన్ కాలం: 6 నెలలు.
వయోపరిమితి: 31.12.2024 నాటికి 23 - 32 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
✦ షార్ట్‌లిస్టింగ్: బ్యాంక్ ఏర్పాటు చేసిన షార్ట్‌లిస్టింగ్ కమిటీ షార్ట్‌లిస్టింగ్ పరిమితులను నిర్ణయిస్తుంది. బ్యాంక్ నిర్ణయించిన విధంగా తగిన సంఖ్యలో మాత్రమే అభ్యర్థులను ఇంటర్వ్యూ కోసం షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలవాలనేది బ్యాంక్‌దే తుది నిర్ణయం. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు అనుమతించబడవు.
✦ ఇంటర్వ్యూ: ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూలో అర్హత మార్కులను బ్యాంక్ నిర్ణయిస్తుంది. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు అనుమతించబడవు.
✦ మెరిట్ జాబితా: ఇంటర్వ్యూలో పొందిన స్కోర్‌ల ఆధారంగా ఎంపిక కోసం మెరిట్ జాబితాను డిసెండింగ్ ఆర్డర్‌లో తయారు చేస్తారు. ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు కటాఫ్ మార్కులు (కటాఫ్ పాయింట్ వద్ద కామన్ మార్కులు) సాధించిన సందర్భంలో అభ్యర్థులను వారి వయస్సు ప్రకారం మెరిట్‌లో డిసెండింగ్ ఆర్డర్‌లో ర్యాంక్ చేస్తారు.
ఇంటర్వ్యూ కోసం కాల్ లెటర్: ఇంటర్వ్యూ కోసం సమాచారం/కాల్ లెటర్ ఈమెయిల్ ద్వారా పంపబడుతుంది లేదా బ్యాంక్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయబడుతుంది. హార్డ్ కాపీ పంపబడదు.
పే స్కేల్: నెలకు రూ.64,820- రూ.93,960.
పోస్టింగ్ ప్రదేశం: హైదరాబాద్, కోల్‌కతా.
ముఖ్యమైన తేదీలు..
🔰 ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 03.01.2025.
🔰 ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 23.01.2025.